జర నవ్వండి ప్లీజ్ 16
టీచర్ లీల :మీ క్లాసులో సోమరిపోతు ఎవరు?ఎప్పుడూ ఏమీ చదవకుండా, రాయకుండా సోమరిగా ఎవరుంటారు ? వాణి : మా క్లాస్ టీచర్ ! ************ తికమక టీచర్ : రాముడెవరు! విద్యార్థి : దశరథుని కొడుకు టీచర్ : దశరథుడెవడు? విద్యార్థి : రాముని తండ్రి. ఏవైనా కష్టమయిన ప్రశ్నలడగండి టీచర్! ************ అసాధ్యుడు చింటు : ఇప్పుడే నాకు రోడ్డు మీద యాభై పైసలు దొరికాయి మింటు : అది నాదే. రెండు నిమిషాల […]
టీచర్
లీల :మీ క్లాసులో సోమరిపోతు ఎవరు?ఎప్పుడూ ఏమీ చదవకుండా, రాయకుండా సోమరిగా ఎవరుంటారు ?
వాణి : మా క్లాస్ టీచర్ !
************
తికమక
టీచర్ : రాముడెవరు!
విద్యార్థి : దశరథుని కొడుకు
టీచర్ : దశరథుడెవడు?
విద్యార్థి : రాముని తండ్రి. ఏవైనా కష్టమయిన ప్రశ్నలడగండి టీచర్!
************
అసాధ్యుడు
చింటు : ఇప్పుడే నాకు రోడ్డు మీద యాభై పైసలు దొరికాయి
మింటు : అది నాదే. రెండు నిమిషాల క్రితం యాభైపైసల కాయిన్ పడేసుకున్నా
చింటు : కానీ నాకు రెండు 25 పైసల బిళ్లలు దొరికాయి
మింటు : అవును అది కింద పడినప్పుడే రెండు ముక్కలైంది
************
సారాంశం
తండ్రి, కూతురు సత్యహరిశ్చంద్ర సినిమాకు వెళ్లి వచ్చారు.నిద్ర లేచాక
తండ్రి సినిమా ఎలా వుంది? అని అడిగాడు
కూతురు : ‘సత్యం చెప్పినవాడు అన్నీ పోగొట్టుకుని శ్మశానాన్ని కావలి కాస్తాడని తెలిసింది’ అంది
తండ్రి : కానీ చివర్లో శివుడు ప్రత్యక్షమై అతన్ని మెచ్చుకున్నాడు కదా!
కూతురు : ‘అప్పటికే నేను నిద్రపోయాను’ అంది.