Telugu Global
International

జర్మన్‌ విమానం కూల్చింది కోపైలెట్టే!

‘మానసిక రోగి’ అని నిర్థారించిన వ్యక్తికి కోపైలెట్‌గా ఉద్యోగం ఇవ్వ‌డ‌మే 150 మంది మరణించడానికి కారణమైందని క‌నుగొన్నారు. జర్మన్‌ వింగ్స్‌ విమానాన్ని కుప్పకూల్చిన కో పైలెట్‌ ఆండ్రియాస్‌ లుబిట్జ్‌ తీవ్రమైన మానసిక సమస్యతో బాధ పడుతున్నాడు. ఐదేళ్లుగా అతడు మందులు వాడుతున్నాడు. అయినా కో పైలెట్‌గా కొనసాగుతున్నాడు. దీనికితోడు  ప్రియురాలితో తీవ్రస్థాయిలో మనస్పర్దలు వచ్చాయి. ఆమె అతనికి దూరం కావడంతో మానసిక రోగం మరింత తిరగబెట్టింది. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో కావాలనే విమానాన్ని ఆల్ప్స్‌ […]

జర్మన్‌ విమానం కూల్చింది కోపైలెట్టే!
X
‘మానసిక రోగి’ అని నిర్థారించిన వ్యక్తికి కోపైలెట్‌గా ఉద్యోగం ఇవ్వ‌డ‌మే 150 మంది మరణించడానికి కారణమైందని క‌నుగొన్నారు. జర్మన్‌ వింగ్స్‌ విమానాన్ని కుప్పకూల్చిన కో పైలెట్‌ ఆండ్రియాస్‌ లుబిట్జ్‌ తీవ్రమైన మానసిక సమస్యతో బాధ పడుతున్నాడు. ఐదేళ్లుగా అతడు మందులు వాడుతున్నాడు. అయినా కో పైలెట్‌గా కొనసాగుతున్నాడు. దీనికితోడు ప్రియురాలితో తీవ్రస్థాయిలో మనస్పర్దలు వచ్చాయి. ఆమె అతనికి దూరం కావడంతో మానసిక రోగం మరింత తిరగబెట్టింది. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో కావాలనే విమానాన్ని ఆల్ప్స్‌ పర్వత శ్రేణుల్లో కిందికి దించేశాడు. కాక్‌పిట్‌ నుంచి బయటకు వెళ్లిన పైలెట్‌ను మళ్లీ లోపలికి రానివ్వలేదు. బ‌య‌ట‌కు వెళ్ళిన పైలెట్ లోప‌లికి రావ‌డానికి శ‌త‌థా ప్ర‌య‌త్నించాడు. కాని కాక్‌పిట్ డోర్ మూసేసి త‌న వికృత‌కీడ‌ను కొన‌సాగించాడు. పైలెట్ త‌లుపులు బాదినా స్పందించ‌లేదు. స్పెయిన్‌లోని బార్సిలోనా నుంచి జర్మనీలోని డ్యూసెల్‌డార్ఫ్‌కు వెళుతున్న విమానం మంగళవారం ఫ్రాన్స్‌లోని ఆల్ప్స్‌ పర్వతాల్లో కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 150 మంది మరణించారు. దీనికి సంబంధించిన బ్లాక్‌ బాక్స్‌ వాయిస్‌ రికార్డరు బుధవారం దొరికింది. దానిలోని మాటలను పరిశీలించినప్పుడు దర్యాప్తు అధికారులకు ఈ విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి.-పి.ఆర్‌.
First Published:  28 March 2015 7:15 AM IST
Next Story