Telugu Global
NEWS

ఏపీని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే: చంద్ర‌బాబు

రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఏపీని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందన్నారు. ఏపీకి రావాల్సిన నిధులనే తాము కోరుతున్నామని, కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి 17,786 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని సీఎం వెల్లడించారు. అదేవిధంగా 2014-15 ఆర్థిక లోటును భర్తీ చేయాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు రాష్ర్టానికి రూ. 500 కోట్లు ఇచ్చారని, త్వరలోనే మరో రూ. 2,500 కోట్లు ఇచ్చే అవకాశం ఉందని […]

ఏపీని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే: చంద్ర‌బాబు
X

రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఏపీని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందన్నారు. ఏపీకి రావాల్సిన నిధులనే తాము కోరుతున్నామని, కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి 17,786 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని సీఎం వెల్లడించారు. అదేవిధంగా 2014-15 ఆర్థిక లోటును భర్తీ చేయాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు రాష్ర్టానికి రూ. 500 కోట్లు ఇచ్చారని, త్వరలోనే మరో రూ. 2,500 కోట్లు ఇచ్చే అవకాశం ఉందని బాబు పేర్కొన్నారు. అదే విధంగా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులివ్వాల్సిన అవశ్యకతను సీఎం వివరించారు.. ఏపీలో హైదరాబాద్‌ లాంటి నగరం కావాలంటే.. కనీసం నాలుగైదు లక్షల కోట్ల పెట్టుబడులను ఆక‌ర్షించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయన విశ్లేషించారు. రాజధాని కోసం కేంద్రం రూ. 1000 కోట్లు రిలీజ్‌ చేసిందన్న సీఎం త్వరలోనే మరో రూ. 500 కోట్లు ఇచ్చే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు.- పి.ఆర్‌.

First Published:  28 March 2015 12:45 AM IST
Next Story