Telugu Global
Cinema & Entertainment

రేయ్, జిల్ సినిమాలపై బాక్స్ ఆఫీస్ రిపోర్ట్

ఈ శుక్రవారం (మార్చి 27) “రేయ్”, “జిల్” రెండు సినిమాలు విడుదలయ్యాయి. ‘రేయ్’ కి ఫ్లాప్ టాక్ రాగా ‘జిల్’ పరవాలేదు అనిపించుకుంది. 5 సం. పైబడి నిర్మాణంలో ఉండి ఆలస్యంగా విడుదలైన “రేయ్” సినిమాకి Y. V.S.చౌదరి 25 కోట్లపైనే  ఖర్చుపెట్టాడట. రిలీజ్ లేట్ కావడం, హీరో సాయిధరమ్ తేజ్ మునపటి సినిమా “పిల్లా నువ్వులేని జీవితం” 16కోట్ల వరకే వసూలు చేయటంతో “రేయ్” బిజినెస్ సరిగ్గా జరగలేదు. నష్టానికి సిద్దపడే Y. V.S.చౌదరి ఈ […]

రేయ్, జిల్ సినిమాలపై బాక్స్ ఆఫీస్ రిపోర్ట్
X

ఈ శుక్రవారం (మార్చి 27) “రేయ్”, “జిల్” రెండు సినిమాలు విడుదలయ్యాయి. ‘రేయ్’ కి ఫ్లాప్ టాక్ రాగా ‘జిల్’ పరవాలేదు అనిపించుకుంది. 5 సం. పైబడి నిర్మాణంలో ఉండి ఆలస్యంగా విడుదలైన “రేయ్” సినిమాకి Y. V.S.చౌదరి 25 కోట్లపైనే ఖర్చుపెట్టాడట. రిలీజ్ లేట్ కావడం, హీరో సాయిధరమ్ తేజ్ మునపటి సినిమా “పిల్లా నువ్వులేని జీవితం” 16కోట్ల వరకే వసూలు చేయటంతో “రేయ్” బిజినెస్ సరిగ్గా జరగలేదు. నష్టానికి సిద్దపడే Y. V.S.చౌదరి ఈ సినిమా రిలీజ్ చేసాడు. చాలా బ్యాడ్ టాక్ తెచ్చుకుంది. ఆదివారం వరకు వుంటే వసూలు లెక్క వేసుకుంటే 5‍- 6 కోట్ల పైన రాకపోవచ్చు. అధికశాత నష్టం Y. V.S.చౌదరి మూటకట్టుకోవాల్సిందే.
ఇక “జిల్” విషయానికి వస్తే హీరో గోపిచంద్ లౌక్యం సినిమా ముందు వరకు ఫ్లాప్స్ మూటగట్టుకున్నాడు. లౌక్యం హిట్ టాక్ తెచ్చుకున్నా 15-20 కోట్ల మధ్యలోనే వసూల్ చేసింది. జిల్ సినిమా స్టైలిష్ డైరెక్టర్ తీసాడని పేరున్నా, స్క్రిప్ట్ విషయంలో రొటీన్ అని వినబడుతుంది. హీరోయిన్ రాశి ఖన్నా ఎక్సపోజ్ చేశారని టాక్ రావడంతో కొంత మంది ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. అయినప్పటికి సినిమా ప్రాఫిట్ బాట పట్టడం కష్టం అంటున్నారు. ఓవర్ బడ్జెట్ కావడం, సినిమా ఎవరేజ్ టాక్ తప్ప హిట్ టాక్ తెచ్చుకోకపోవడంతో ఈ సినిమా 10 కోట్ల వరకే వసూల్ చేయవచ్చని ఒక అంచన.

First Published:  28 March 2015 12:00 PM IST
Next Story