Telugu Global
NEWS

ఏపీ సర్కారు ప్రతిపాదిస్తే నవ్యాంధ్రలోనే హైకోర్టు: సుప్రీం సీజే

ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు భూమి, మౌలిక సదుపాయాలను సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పిస్తే నవ్యాంధ్రలోనే దానిని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌.ఎల్‌. దత్తు హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు న్యాయవాది అనుమోలు వెంకటేశ్వరరావు, ఏపీ న్యాయవాదుల జేఏసీ నాయకులు, 13 జిల్లాల బార్‌ కౌన్సిల్‌ ప్రతినిధుల బృందం సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ దత్తును కలిసి ‘ఏపీ హైకోర్టును ఏపీలోనే ఏర్పాటు చేయాలి’ అని కోరుతూ వినతిపత్రం సమర్పించింది. మరోవైపు.. హైకోర్టు […]

ఏపీ సర్కారు ప్రతిపాదిస్తే నవ్యాంధ్రలోనే హైకోర్టు: సుప్రీం సీజే
X

ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు భూమి, మౌలిక సదుపాయాలను సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పిస్తే నవ్యాంధ్రలోనే దానిని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌.ఎల్‌. దత్తు హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు న్యాయవాది అనుమోలు వెంకటేశ్వరరావు, ఏపీ న్యాయవాదుల జేఏసీ నాయకులు, 13 జిల్లాల బార్‌ కౌన్సిల్‌ ప్రతినిధుల బృందం సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ దత్తును కలిసి ‘ఏపీ హైకోర్టును ఏపీలోనే ఏర్పాటు చేయాలి’ అని కోరుతూ వినతిపత్రం సమర్పించింది. మరోవైపు.. హైకోర్టు విభజనకు సంబంధించి కౌంటర్లు దాఖలు చేయాలని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కళ్యాణజోతి సేన్‌గుప్త, జస్టిస్‌ పీవీ సంజయ్‌ కుమార్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది.- పి.ఆర్‌.

First Published:  28 March 2015 12:40 AM IST
Next Story