ద్రవ్యవినిమయ బిల్లుకు ఏపి అసెంబ్లీ ఆమోదం... నిరవధిక వాయిదా
అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. పెన్షన్లు, ద్రవ్యవినిమయ బిల్లు చర్చ అనంతరం సభ ఆమోదించింది. దీంతోపాటు మరో 11 బిల్లులను కూడా విధానసభ ఆమోదించింది. డ్వాక్రా మహిళల రుణాలు, రైతుల రుణ మాఫీ వంటి పలు ఆంశాలపై తుది రోజు సుదీర్ఘ చర్చ జరిగింది. దీంతోపాటు హౌసింగ్‌పై ఈరోజు జరిగిన చర్చ రసవత్తరంగా సాగింది. విపక్ష నేత వై.ఎస్. జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతులకు రుణ మాఫీ పేరిట చేస్తున్న కార్యక్రమం అంతా పెద్ద బోగస్ అని […]
BY Pragnadhar Reddy27 March 2015 11:44 AM IST
X
Pragnadhar Reddy Updated On: 27 March 2015 11:47 AM IST
అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. పెన్షన్లు, ద్రవ్యవినిమయ బిల్లు చర్చ అనంతరం సభ ఆమోదించింది. దీంతోపాటు మరో 11 బిల్లులను కూడా విధానసభ ఆమోదించింది. డ్వాక్రా మహిళల రుణాలు, రైతుల రుణ మాఫీ వంటి పలు ఆంశాలపై తుది రోజు సుదీర్ఘ చర్చ జరిగింది. దీంతోపాటు హౌసింగ్‌పై ఈరోజు జరిగిన చర్చ రసవత్తరంగా సాగింది. విపక్ష నేత వై.ఎస్. జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతులకు రుణ మాఫీ పేరిట చేస్తున్న కార్యక్రమం అంతా పెద్ద బోగస్ అని ఆయన విమర్శించారు. ఇది వారికి ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చడం లేదని ఆయన విమర్శించారు. పైగా డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ వర్తింప జేస్తామని హామీలు ఇచ్చి నమ్మించి మోసం చేశారని, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాల మాఫీకి గాను 1820 కోట్లు కేటాయించాల్సి ఉండగా ఒక్క పైసా కూడా కేటాయించలేదని ఆయన విమర్శించారు. మొత్తం మీద వాడివేడి చర్చ అనంతరం సభ ద్రవ్య వినిమయ బిల్లుతోపాటు మరో 11 బిల్లులను ఆమోదిస్తూ నిరవధికంగా వాయిదా పడింది. -పి.ఆర్.
Next Story