టి.అసెంబ్లీ నిరవధిక వాయిదా
తెలంగాణ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం సభ ఆమోదం తెలిపింది. అనంతరం అసెంబ్లీ కార్యకలాపాలను నిర్వహించేందుకు సహకరించిన సభ్యులందరికీ స్పీకర్ మధుసూధనాచారి కృతజ్ఞతలు తెలిపి సభను నిరవదిక వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అంతకుముందు ద్రవ్య వినిమయ బిల్లు చర్చలో సీఎం కేసీఆర్ లేకపోవడం బాధాకరమని కాంగ్రెస్ సభ్యులు తప్పుపట్టారు. అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ సభ్యుల వాకౌట్ […]
తెలంగాణ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం సభ ఆమోదం తెలిపింది. అనంతరం అసెంబ్లీ కార్యకలాపాలను నిర్వహించేందుకు సహకరించిన సభ్యులందరికీ స్పీకర్ మధుసూధనాచారి కృతజ్ఞతలు తెలిపి సభను నిరవదిక వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అంతకుముందు ద్రవ్య వినిమయ బిల్లు చర్చలో సీఎం కేసీఆర్ లేకపోవడం బాధాకరమని కాంగ్రెస్ సభ్యులు తప్పుపట్టారు. అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ సభ్యుల వాకౌట్ చేశారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ కూడా సీఎం వైఖరిని విమర్శించారు రూ.1.15 లక్షల కోట్ల బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. – పి.ఆర్.