Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 13

ప్రేమతో ”నీకు నామీద ప్రేమ ఉంటే పెళ్లిలో కట్నం మాట ఎత్తవు కదా” అంది ఫెమినిస్టు ప్రభ సూర్యంతో. ”అసలు పెళ్లి మాటే ఎత్తను” అన్నాడు సూర్యం. ************ సైలెంట్‌ మోడ్‌ ”సెల్‌ఫోన్‌కూ గర్ల్‌ఫ్రెండ్‌కు తేడా ఏమిటంటావ్‌?” అడిగాడు పార్వతీశం సుందరసాయిని. ”సెల్‌ఫోన్‌ అయితే ‘సైలెంట్‌ మోడ్‌’లో పెట్టవచ్చు. గర్ల్‌ఫ్రెండ్‌ని పెట్టలేం కదా!” అన్నాడు సాయి. ************ కుదరని పని ఆఫీసర్‌: ‘ఏమిటోయ్‌ సూర్యం నీ సీటు వదిలేసి పొద్దుట్నుంచీ ఎక్కడ తిరుగుతున్నావ్‌’ సూర్యం: ‘ఆ! ఆ […]

ప్రేమతో
”నీకు నామీద ప్రేమ ఉంటే పెళ్లిలో కట్నం మాట ఎత్తవు కదా” అంది ఫెమినిస్టు ప్రభ సూర్యంతో.
”అసలు పెళ్లి మాటే ఎత్తను” అన్నాడు సూర్యం.
************
సైలెంట్‌ మోడ్‌
”సెల్‌ఫోన్‌కూ గర్ల్‌ఫ్రెండ్‌కు తేడా ఏమిటంటావ్‌?” అడిగాడు పార్వతీశం సుందరసాయిని. ”సెల్‌ఫోన్‌ అయితే ‘సైలెంట్‌ మోడ్‌’లో పెట్టవచ్చు. గర్ల్‌ఫ్రెండ్‌ని పెట్టలేం కదా!” అన్నాడు సాయి.
************
కుదరని పని
ఆఫీసర్‌: ‘ఏమిటోయ్‌ సూర్యం నీ సీటు వదిలేసి పొద్దుట్నుంచీ ఎక్కడ తిరుగుతున్నావ్‌’
సూర్యం: ‘ఆ! ఆ సీటు కూడా వెంటబెట్టుకుని తిరగడం ఎలా కుదురుతుంది సార్‌? అది బాగా బరువు కూడాను అందుకే వదిలేశా.
************
‘ జాగ్రత్త ‘
అదేంటండీ? డాక్టర్‌గారు వేసుకోమన్న ఆ పెద్ద మాత్రను అలా సైడ్స్‌ చాకుతో కోసేసి వేసుకుంటున్నారు?” అడిగింది భార్య.
”సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏవీ రాకుండా ఉంటాయని” బదులిచ్చాడు ఆ భర్త.

First Published:  27 March 2015 12:30 AM IST
Next Story