రాజధాని రైతులకు హైకోర్టులో ఊరట
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని భూసమీకరణకు వ్యతిరేకంగా పిటిషన్ వేసిన రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. భూమిని ఇవ్వడం ఇష్టం లేని రైతులను ఇబ్బందులు పెట్టవద్దని, వారు భూములు బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేయవద్దని కోర్టు స్పష్టంగా పేర్కొంది. దాదాపు 35 మంది రైతులు తమకు భూములు ఇవ్వడం ఇష్టం లేదని, తమ దగ్గర నుంచి బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇలాంటి పిటిషనే మరోటి గురువారం హైకోర్టులో వేశారు. ఇందులో 50 […]
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని భూసమీకరణకు వ్యతిరేకంగా పిటిషన్ వేసిన రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. భూమిని ఇవ్వడం ఇష్టం లేని రైతులను ఇబ్బందులు పెట్టవద్దని, వారు భూములు బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేయవద్దని కోర్టు స్పష్టంగా పేర్కొంది. దాదాపు 35 మంది రైతులు తమకు భూములు ఇవ్వడం ఇష్టం లేదని, తమ దగ్గర నుంచి బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇలాంటి పిటిషనే మరోటి గురువారం హైకోర్టులో వేశారు. ఇందులో 50 మంది రైతులు సంతకాలు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. భూ సమీకరణ ఇష్టంలేని రైతులను జాబితా నుంచి తొలగించాలని సీఆర్డీఏ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు భూ సమీకరణలో ఎలాంటి అవరోధాలు లేవని, అందరూ స్వచ్ఛందంగా భూములను ఇస్తున్నారని చెబుతున్న మంత్రులకు, అధికార గణానికి ఇది ఎదురుదెబ్బని చెప్పకతప్పదు. గుంటూరు జిల్లాలో రాజధాని నిర్మాణానికి ఇది అవరోధంగా చెప్పవచ్చు. రాజధాని నిర్మాణం ఆగకపోయినా జాప్యం కాక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.