నాలుగు జిల్లాల్లో చెక్‌పోస్టులపై ఏసీబీ దాడులు
అనంతపురం: రాష్ట్రవ్యాప్తంగా చెక్‌పోస్టులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అనంతపురం, నెల్లూరు, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. అనంతపురం జిల్లా పెనుకొండలో లెక్కల్లో చూపని రూ.77,800ల నగదు స్వాధీనం చేసుకున్నారు. విధి నిర్వహణలో ఉన్న ఏఎంవీఐ నాంగేంద్రపై కేసు నమోదు చేసి ఓ ప్రైవేట్ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎప్పుడూ అవినీతికి ఆలవాలంగా ఉండే నెల్లూరు జిల్లా తడ చెక్‌పోస్టులో మాత్రం ఈసారి మామూలు కన్నా భిన్నమైన వాతావరణం కనిపించింది. ఎక్కడా ఒక్క […]
అనంతపురం: రాష్ట్రవ్యాప్తంగా చెక్‌పోస్టులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అనంతపురం, నెల్లూరు, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. అనంతపురం జిల్లా పెనుకొండలో లెక్కల్లో చూపని రూ.77,800ల నగదు స్వాధీనం చేసుకున్నారు. విధి నిర్వహణలో ఉన్న ఏఎంవీఐ నాంగేంద్రపై కేసు నమోదు చేసి ఓ ప్రైవేట్ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎప్పుడూ అవినీతికి ఆలవాలంగా ఉండే నెల్లూరు జిల్లా తడ చెక్‌పోస్టులో మాత్రం ఈసారి మామూలు కన్నా భిన్నమైన వాతావరణం కనిపించింది. ఎక్కడా ఒక్క పైసా లభించకపోగా ఎప్పుడూ యూనిఫాంలో ఉండని అధికారులు కూడా యూనిఫాం వేసుకుని బుద్ధిగా పని చేసుకోవడం కనిపించింది. ఇదంతా చూస్తుంటే దాడి విషయం ముందే లీకైనట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పురుషోత్తపురం ఇంటిగ్రేటెడ్ చెక్‌పో్‌స్టపై అర్ధరాత్రి ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఈ సమయంలో ప్రయివేటు వ్యక్తులు, కౌంటర్ల వద్ద వసూలు చేసిన అనధికార మొత్తం రూ.1,17,830 ఉన్నట్లు గుర్తించారు. దాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనధికార వ్యక్తుల నుంచి వాంగ్మూలాలు సేకరించారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు సమీపంలోని మేదరమెట్ల-నార్కెట్‌పల్లి మార్గంలో ఉన్న రవాణాశాఖ తనిఖీ కేంద్రంలో ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి ఆకస్మికంగా దాడులు చేసి రూ. 31 వేలు అక్రమ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. – పి.ఆర్.