శిక్షల నుంచి తప్పించుకునేందుకే క్షమాపణలు: అచ్చెనాయుడు
ప్రజాస్వామ్యం సిగ్గు పడే విధంగా మీరు వ్యవహరించారని, స్పీకర్‌కు మీరు క్షమాపణ చెబితే దానికి ఆయన అంగీకరిస్తే తమకు ఏ మాత్రం అభ్యంతరం లేదని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. వైకాపా సభ్యుల క్షమాపణల ప్రకటన వింటుంటే అది మనస్ఫూర్తిగా చెబుతున్నట్టు లేదని, కేవలం రేపు పడే శిక్షల నుంచి తప్పించుకునే ఎత్తుగడగా కనిపిస్తుందని అచ్చెనాయుడు అన్నారు. సభ్యుల ప్రవర్తన, హావభావాలు చూస్తుంటే వంద శాతం పశ్చాత్తాపం కనపడడం లేదని మరో మంత్రి యనమల […]
ప్రజాస్వామ్యం సిగ్గు పడే విధంగా మీరు వ్యవహరించారని, స్పీకర్‌కు మీరు క్షమాపణ చెబితే దానికి ఆయన అంగీకరిస్తే తమకు ఏ మాత్రం అభ్యంతరం లేదని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. వైకాపా సభ్యుల క్షమాపణల ప్రకటన వింటుంటే అది మనస్ఫూర్తిగా చెబుతున్నట్టు లేదని, కేవలం రేపు పడే శిక్షల నుంచి తప్పించుకునే ఎత్తుగడగా కనిపిస్తుందని అచ్చెనాయుడు అన్నారు. సభ్యుల ప్రవర్తన, హావభావాలు చూస్తుంటే వంద శాతం పశ్చాత్తాపం కనపడడం లేదని మరో మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. మొత్తం మీద ఈ క్షమాపణల పర్వంతో సభా హక్కుల నోటీసు రగడ ముగిసినట్టే కనిపిస్తోంది. – పి.ఆర్.