పాస్‌పోర్టు వెరిఫికేషన్ ఇక ‘వెరీఫాస్ట్’!
పాస్‌పోర్టు దరఖాస్తుల పరిశీలన నిర్ణీత గడువులోగా పూర్తి చేసి తీరాలని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ సంబంధిత అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. పాస్‌పోర్టు దరఖాస్తుల పరిశీలనకు తెలంగాణ పోలీస్ విభాగం నూతనంగా రూపొందించిన ‘వెరీఫాస్ట్’ సాఫ్ట్‌వేర్‌పై అనురాగ్ శర్మ అన్ని జిల్లాల ఎస్పీలు, ఎస్‌బీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన కొత్త సాఫ్ట్‌వేర్ మొదట హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఉపయోగించి ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. పాస్‌పోర్ట్ దరఖాస్తు పరిశీలనకు సంబంధించి […]
పాస్‌పోర్టు దరఖాస్తుల పరిశీలన నిర్ణీత గడువులోగా పూర్తి చేసి తీరాలని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ సంబంధిత అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. పాస్‌పోర్టు దరఖాస్తుల పరిశీలనకు తెలంగాణ పోలీస్ విభాగం నూతనంగా రూపొందించిన ‘వెరీఫాస్ట్’ సాఫ్ట్‌వేర్‌పై అనురాగ్ శర్మ అన్ని జిల్లాల ఎస్పీలు, ఎస్‌బీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన కొత్త సాఫ్ట్‌వేర్ మొదట హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఉపయోగించి ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. పాస్‌పోర్ట్ దరఖాస్తు పరిశీలనకు సంబంధించి గతంలో విదేశాంగ శాఖ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో పోలీసు పరిశీలనకు సంబంధించిన ఆప్షన్ లేకపోవడంతో తెలంగాణ పోలీసులు ‘వెరీఫాస్ట్’ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. ఈ సాఫ్ట్‌వేర్ మెరుగ్గా ఉందని, దీని ఉపయోగానికి సంబంధించి రెండు దశల్లో అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నామని డీజీపీ చెప్పారు.