స్పీకర్‌కు జగన్ బేషరతు క్షమాపణలు
స్పీకర్ స్థానం మీద ఏవైనా మాటలు దొర్లి ఉంటే బేషరతుగా క్షమాపణలు చెబుతున్నామని వైకాపా అధినేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్. జగన్మోహనరెడ్డి ప్రకటించారు. విధానసభలో వైకాపా సభ్యులకు సంబంధించి సభా హక్కుల నోటీసుపై చర్చ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 19వ తేదీన అసెంబ్లీలో జరిగిన వ్యవహారశైలికి తమ పార్టీ విచారం వ్యక్తం చేస్తుందని, స్పీకర్‌ను కించపరచాలనిగాని, అవమానించాలనిగాని తమ అభిమతం కాదని, తమకు నొప్పి కలిగించి ఉంటే తమ సభ్యుల తరఫున, పార్టీ తరఫున […]
స్పీకర్ స్థానం మీద ఏవైనా మాటలు దొర్లి ఉంటే బేషరతుగా క్షమాపణలు చెబుతున్నామని వైకాపా అధినేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్. జగన్మోహనరెడ్డి ప్రకటించారు. విధానసభలో వైకాపా సభ్యులకు సంబంధించి సభా హక్కుల నోటీసుపై చర్చ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 19వ తేదీన అసెంబ్లీలో జరిగిన వ్యవహారశైలికి తమ పార్టీ విచారం వ్యక్తం చేస్తుందని, స్పీకర్‌ను కించపరచాలనిగాని, అవమానించాలనిగాని తమ అభిమతం కాదని, తమకు నొప్పి కలిగించి ఉంటే తమ సభ్యుల తరఫున, పార్టీ తరఫున క్షమాపణ చెబుతున్నానని జగన్ అన్నారు. ఇదే సభలో చంద్రబాబునాయుడు మా అంతు చూస్తామని అన్నారని, దానిపై సభా హక్కుల నోటీసు పెండింగ్‌లో ఉందని, అలాగే కొంతమంది మంత్రుల తమ సభ్యులను అసభ్యంగా మాట్లాడారని, వారిపై కూడా హక్కుల నోటీసు పెండింగ్‌లో ఉందని, తాము తెలుగుదేశం పార్టీకిగాని, ప్రభుత్వానికిగాని క్షమాఫణలు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ఇదే విషయంపై వైకాపా ఎమ్మెల్యే ఆర్.కె. రోజా మాట్లాడుతూ ఒక తండ్రికి ఇద్దరు పిల్లలుంటే ఒకే మాదిరిగా చూడాలని పిల్లలు కోరుకుంటారని, తాము కూడా అలాగే కోరామని, ఈ సందర్భంగా తాము స్పీకర్ స్థానంలో ఉన్న మిమ్మల్ని నొప్పించి ఉంటే క్షమాపణలు చెబుతున్నామని, తండ్రిలా పెద్ద మనస్సుతో తమను మన్నించాలని ఆమె కోరారు. వైకాపాకు చెందిన 9 మంది సభ్యుల కూడా స్పీకర్‌కు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. – పి.ఆర్.