పైనల్లో అస్ట్రేలియా-న్యూజీలాండ్
ఈ ప్రపంచకప్ సెషన్లో తొలిసారిగా భారత్ ఓటమిని చవి చూసింది. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్ సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం పాలైంది. టాప్ ఆర్డర్, మిడల్ ఆర్డర్‌తోపాటు ఏ ఒక్కరూ కూడా బరిలో నిలిచి ఒక్కటంటే ఒక్క శతకాన్ని కూడా పూర్తి చేయలేక పోయారు. తడబడుతూ మొదలుపెట్టిన బ్యాటింగ్ ఓవర్లు అయిపోతున్నా రన్‌లు మాత్రం అంది రాలేదు. మొదటి వంద రన్‌లు పూర్తయ్యేసరికే మూడు వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడిపోయింది. […]
ఈ ప్రపంచకప్ సెషన్లో తొలిసారిగా భారత్ ఓటమిని చవి చూసింది. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్ సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం పాలైంది. టాప్ ఆర్డర్, మిడల్ ఆర్డర్‌తోపాటు ఏ ఒక్కరూ కూడా బరిలో నిలిచి ఒక్కటంటే ఒక్క శతకాన్ని కూడా పూర్తి చేయలేక పోయారు. తడబడుతూ మొదలుపెట్టిన బ్యాటింగ్ ఓవర్లు అయిపోతున్నా రన్‌లు మాత్రం అంది రాలేదు. మొదటి వంద రన్‌లు పూర్తయ్యేసరికే మూడు వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడిపోయింది. ఆ తర్వాత రెండో శతకం పూర్తయ్యేసరికి మరో రెండు వికెట్లు పడిపోయాయి. అంటే బ్యాట్స్‌మెన్‌లు ఎవరూ మిగలలేదన్న మాట. ఇక ఆ తర్వాత వికెట్ 208 దగ్గర పడిపోయింది. ఇక అక్కడి నుంచి 233 రన్‌లకు చేరువయ్యేసరికి మొత్తం వికెట్లు టపటపా రాలిపోయాయి. గొప్పగా చెప్పుకోవాల్సి వస్తే 65 బంతుల్లో 65 రన్‌లు చేసిన థోనీనే. ఆ తర్వాత 41 బంతుల్లో 45 రన్‌లు చేసిన శిఖర ధావన్‌ని. మొత్తం మీద ఎనిమిది జట్లపై వీరపరంపరతో విజయ బావుటా ఎగరేసుకుంటూ ప్రపంచ కప్ ఆశల్ని ఉంచిన భారత్ ఈరోజు ఆస్ట్రేలియాపై జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో వాటిని చిదిమేసింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో వీర విజృంభణ చేసి 328 పరుగులను చేసింది. 329 పరుగుల టార్గెట్‌ను భారత్ ముందు ఉంచి సవాలు విసిరింది. ఈ సవాలుకు జవాబు చెప్పడంలో భారత్ బొక్కబోర్లా పడింది.