ఏపీకి కొత్తగా 7 విద్యాసంస్థలు
తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా ఏడు విద్యాసంస్థలు రానున్నాయని మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో ఐఏఎం, పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్‌ఐటీ, విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ, కర్నూలులో అదనంగా మరో ట్రిపుల్ ఐటీలను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. చిత్తూరు జిల్లా ఏర్పేడులో 28వ తేదీన ఐఐటీ, ఐఎస్‌ఆర్, శ్రీసిటీలో ట్రిపుల్ ఐటీ సంస్థల భవనాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఏర్పేడు, శ్రీసిటీల్లో శంకుస్థాపన ఏర్పాట్లపై తిరుపతిలోని తుడా కార్యాలయంలో […]
తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా ఏడు విద్యాసంస్థలు రానున్నాయని మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో ఐఏఎం, పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్‌ఐటీ, విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ, కర్నూలులో అదనంగా మరో ట్రిపుల్ ఐటీలను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. చిత్తూరు జిల్లా ఏర్పేడులో 28వ తేదీన ఐఐటీ, ఐఎస్‌ఆర్, శ్రీసిటీలో ట్రిపుల్ ఐటీ సంస్థల భవనాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఏర్పేడు, శ్రీసిటీల్లో శంకుస్థాపన ఏర్పాట్లపై తిరుపతిలోని తుడా కార్యాలయంలో అధికారులతో మంత్రులు సమీక్షించారు. అనంతరం మీడియాతోనూ మాట్లాడుతూ విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. అందువల్లే రాష్ట్ర బడ్జెట్‌లో 16 శాతం నిధులను విద్యకు కేటాయించారని, అవసరమైతే ఇంకా పెంచుతామని సీఎం చెప్పారన్నారు. కాగా, ట్రిపుల్‌ఐటీ, ఐఎస్‌ఆర్, ఐఐటీ భవనాల శంకుస్థాపన కార్యక్రమాల్లో విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు అవసరమైన బస్సులను ఏర్పాటు చేయాలన్నారు.