మొదలైన టెన్త్ పరీక్షలు
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,614 కేంద్రాల్లో జరుగుతున్న ఈ పరీక్షలకు 5.65 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. విద్యార్థుల సౌకర్యం కోసం అరగంట ముందే పరీక్ష హాల్లోకి అనుమతించాలని జిల్లా విద్యాధికారులు సంబంధిత పరీక్ష కేంద్రాలను ఆదేశించారు. మొత్తం 10,978 పాఠశాలల నుంచి విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. రెగ్యులర్ విద్యార్థులకు 2,383 కేంద్రాలను, ప్రయివేటు విద్యార్థులకు 231 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం విద్యార్థుల్లో 5,15,590 మంది రెగ్యులర్ కాగా […]
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,614 కేంద్రాల్లో జరుగుతున్న ఈ పరీక్షలకు 5.65 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. విద్యార్థుల సౌకర్యం కోసం అరగంట ముందే పరీక్ష హాల్లోకి అనుమతించాలని జిల్లా విద్యాధికారులు సంబంధిత పరీక్ష కేంద్రాలను ఆదేశించారు. మొత్తం 10,978 పాఠశాలల నుంచి విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. రెగ్యులర్ విద్యార్థులకు 2,383 కేంద్రాలను, ప్రయివేటు విద్యార్థులకు 231 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం విద్యార్థుల్లో 5,15,590 మంది రెగ్యులర్ కాగా 49,410 మంది ప్రయివేటు విద్యార్థులు. వీరిలో బాలికలు 2,72,236 మంది కాగా బాలురు 2,92,764 మంది. ఒకేషనల్ విద్యార్థులు 11,041 మంది. పరీక్షల్లో విద్యార్థులు కాపీ కొట్టకుండా చూసేందుకు 144 ఫ్లైయింగ్ స్వ్కాడ్లు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు వారి హాల్ టిక్కెట్లు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముక్కాల రవీందర్ తెలిపారు. పరీక్షలు పూర్తయ్యే వరకు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని ఆయన అన్నారు. మధ్యలో ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చన్నారు. అలాగే బస్‌పాస్, హాల్ టిక్కెట్ చూపిస్తే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన తెలిపారు. విద్యార్థులు ఎక్కడా ఇబ్బంది పడకుండా తగినన్ని బస్సులు నడుపుతున్నామని ఆయన చెప్పారు.