ఏపీ ఎమ్మెల్సీలుగా రామకృష్ణ, సూర్యారావు ఎన్నిక
కృష్ణా, గుంటూరు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్.టి.యు నుంచి పోటీ చేసిన ఎ.ఎస్. రామకృష్ణ ఘన `విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే ఈయన తన విజయాన్ని సొంతం చేసుకున్నారు. రామకృష్ణకు తెలుగుదేశం పార్టీతోపాటు 33 ఉపాధ్యాయ సంఘాలు మద్దతు ఇచ్చాయి. ఈయనకు 6986 ఓట్లు రాగా సమీప ప్రత్యర్ధి, పి.డి.ఎఫ్. అభ్యర్ధి అయిన లక్ష్మణరావుకు 5037 ఓట్లు వచ్చాయి. పి.డి.ఎఫ్ తరఫున ఈయన మూడోసారి బరిలో నిలిచినా విజయాన్ని సొంతం చేసుకోలేకపోయారు. రాజకీయంగా టీచర్లపై […]
BY Pragnadhar Reddy25 March 2015 7:45 AM GMT
Pragnadhar Reddy Updated On: 25 March 2015 7:45 AM GMT
కృష్ణా, గుంటూరు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్.టి.యు నుంచి పోటీ చేసిన ఎ.ఎస్. రామకృష్ణ ఘన 'విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే ఈయన తన విజయాన్ని సొంతం చేసుకున్నారు. రామకృష్ణకు తెలుగుదేశం పార్టీతోపాటు 33 ఉపాధ్యాయ సంఘాలు మద్దతు ఇచ్చాయి. ఈయనకు 6986 ఓట్లు రాగా సమీప ప్రత్యర్ధి, పి.డి.ఎఫ్. అభ్యర్ధి అయిన లక్ష్మణరావుకు 5037 ఓట్లు వచ్చాయి. పి.డి.ఎఫ్ తరఫున ఈయన మూడోసారి బరిలో నిలిచినా విజయాన్ని సొంతం చేసుకోలేకపోయారు. రాజకీయంగా టీచర్లపై అనేక ఒత్తిళ్ళు తీసుకువచ్చారని, అయినా విజయాన్ని ఆపలేక పోయారని, ఉపాధ్యాయుల్లో ఉన్న సమైక్యతకు ఇది నిదర్శనమని రామకృష్ణ తన గెలుపుపై వ్యాఖ్యానించారు. రామకృష్ణ విజయాన్ని పురస్కరించుకుని గుడివాడలో ఉపాధ్యాయ సంఘాలు ర్యాలీ నిర్వహించి సంబరాలు చేసుకున్నాయి.
ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యునైటెడ్ టీచర్స్ ఫ్రంట్ అభ్యర్ధి రాము సూర్యారావు విజయం ఖాయమైంది. టీడీపీ బలపరిచిన అభ్యర్థి చైతన్యరాజు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. – పి.ఆర్.
Next Story