వైకాపా సభ్యులపై సభా హక్కుల నోటీసు
విధానసభలో సభాపతిపై వ్యాఖ్యలు చేసిన వైకాపా సభ్యులపై సభా హక్కుల నోటీసును ప్రవేశపెట్టిన తెలుగుదేశం ఎమ్మెల్యే అనిత స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ విషయంపై పలువురు తెలుగుదేశం సభ్యులు మాట్లాడారు. ఎంతో విలువైన స్పీకర్ స్థానంపై విమర్శలు చేయడం దురదృష్టకరమని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. తమపై విశ్వాసం ఉంచి ప్రజలు అసెంబ్లీకి పంపారని, వారి ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందని గౌరవ సభ్యులు […]
BY Pragnadhar Reddy25 March 2015 9:13 AM IST
X
Pragnadhar Reddy Updated On: 25 March 2015 9:21 AM IST
విధానసభలో సభాపతిపై వ్యాఖ్యలు చేసిన వైకాపా సభ్యులపై సభా హక్కుల నోటీసును ప్రవేశపెట్టిన తెలుగుదేశం ఎమ్మెల్యే అనిత స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ విషయంపై పలువురు తెలుగుదేశం సభ్యులు మాట్లాడారు. ఎంతో విలువైన స్పీకర్ స్థానంపై విమర్శలు చేయడం దురదృష్టకరమని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. తమపై విశ్వాసం ఉంచి ప్రజలు అసెంబ్లీకి పంపారని, వారి ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందని గౌరవ సభ్యులు గుర్తించాలని ఆయన కోరారు. సభ విలువైన సమయాన్ని ప్రతిపక్ష సభ్యులు వృధా చేయడాన్ని మరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తప్పు పట్టారు. సభా సమయం సద్వినియోగం చేయాల్సిన బాధ్యత ప్రతి సభ్యునిపై ఉందని, దాన్ని గుర్తించి మసలుకోవాలని ఆయన అన్నారు. అసలు ప్రతిపక్ష సభ్యుల తీరే చిత్ర విచిత్రంగా ఉందని, ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఎవరిపై విరుచుకు పడతారో తెలియకుండా ఉందని, ఇది మంచి పద్ధతి కాదని మంత్రి కె.ఈ. కృష్ణమూర్తి అన్నారు. సభ్యుల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత సభాధ్యక్షుడిగా స్పీకర్‌కు ఉంటుందని విపక్ష సభ్యులు గుర్తించాలని మరో సభ్యుడు ఆలపాటి రాజా అన్నారు. సభా సమయాన్ని దుర్వినియోగం చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా జగన్‌కు ఉందని, ఆయనే సభా సమయాన్ని వృధా చేయడం చూస్తే అసెంబ్లీ పట్ల ఆయనకు గౌరవ భావం లేదని అర్ధమవుతుందని రాజా అన్నారు.
ఈ విషయంపై ప్రతిపక్ష నాయకుడు జగన్ మాట్లాడుతూ స్పీకర్‌పై దుర్భాషలాడారన్న కారణంతో ఇప్పటికే తమ పార్టీకి చెందిన ఎనిమిది మంది సభ్యులను మూడు రోజులపాటు సస్పెండ్ చేశారని మళ్ళీ వారిపై సభా హక్కుల నోటీసు ఏమిటని ఆయన ప్రశ్నించారు. దీనిపై ఎవరూ మాట్లాడ వద్దని ఈ అంశం చర్చకు వచ్చినపుడు అందరూ మాట్లాడవచ్చని స్పీకర్ కోడెల చెప్పారు.
Next Story