Telugu Global
Cinema & Entertainment

'మా' ఎన్నికలకు రాజకీయ రంగు

“మా’ ఎన్నికలు రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. ప్రస్తుత మా అధ్యక్షుడు మురళీమోహన్‌ ప్రతిపాదించిన జయసుధ, మెగా ఫ్యామిలీ మద్దతుతో పోటీ చేస్తున్న సినీ హీరో రాజేంద్రప్రసాద్‌ మధ్య జరుగుతున్న ఈ పోటీ రసవత్తరంగా మారుతోంది. 43 సంవత్సరాలుగా వివిధ పాత్రలు పోషించిన జయసుధ మాట్లాడుతూ తనను పోటీ నుంచి విరమించుకోవలసిందిగా బెదిరింపులు వచ్చాయని అయినా వెనక్కు తగ్గేది లేదని తెలిపారు. రాజకీయ నాయకులు మా ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం మంచి పద్ధతి కాదని, తనను పోటీ నుంచి […]

మా ఎన్నికలకు రాజకీయ రంగు
X

“మా’ ఎన్నికలు రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. ప్రస్తుత మా అధ్యక్షుడు మురళీమోహన్‌ ప్రతిపాదించిన జయసుధ, మెగా ఫ్యామిలీ మద్దతుతో పోటీ చేస్తున్న సినీ హీరో రాజేంద్రప్రసాద్‌ మధ్య జరుగుతున్న ఈ పోటీ రసవత్తరంగా మారుతోంది. 43 సంవత్సరాలుగా వివిధ పాత్రలు పోషించిన జయసుధ మాట్లాడుతూ తనను పోటీ నుంచి విరమించుకోవలసిందిగా బెదిరింపులు వచ్చాయని అయినా వెనక్కు తగ్గేది లేదని తెలిపారు. రాజకీయ నాయకులు మా ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం మంచి పద్ధతి కాదని, తనను పోటీ నుంచి తప్పుకొమ్మని డిమాండు చేశారని ఆమె ఆరోపించారు. ఇది తనను పోటీకి మరింత ప్రేరేపించిందని ఆమె అన్నారు. ప్రెస్‌మీట్‌లో సినీ హీరో కృష్ణంరాజు మాట్లాడుతూ రాజేంద్రప్రసాద్‌ ప్యానల్‌లో ఉన్నవారు ఓటర్లకు సెల్‌ఫోన్‌లు ఇవ్వడం వంటి ప్రలోభాలకు గురి చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని ఆరోపించారు. నటి హేమ నేరుగా నాగబాబునే టార్గెట్‌గా చేసి మాట్లాడారు. ఆయన మా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డబ్బులు దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. మరో హీరో నరేష్‌ మాట్లాడుతూ మహిళలకు అవకాశం ఇవ్వడం అధ్యక్ష పదవికి వన్నె తెస్తుందని అంటూ పరోక్షంగా రాజేంద్రప్రసాద్‌ను బరి నుంచి తప్పుకోమని సలహా ఇచ్చారు.

First Published:  24 March 2015 10:30 PM IST
Next Story