తెలంగాణలో ఓ పట్టభద్రుల స్థానం బీజేపీ కైవసం
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా భారతీయ జనతాపార్టీ అభ్యర్ధి రామచంద్రరావు విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఈయన గెలిచారు. రామచంద్రరావుకు 13,318 ఓట్లు లబించాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నట్టు టీఆఆర్ెస్ టీ.ఆర్.ఎస్. అభ్యర్థి దేవీ ప్రసాద్ ప్రకటించారు. తన ఓటమి ప్రభుత్వ ఓటమి కాదని ఆయన స్సష్టం చేశారు. సరైన రీతిలో తాము ప్రచారం చేయలేకపోవడం వల్లే తాము ఓటమి పాలైనట్టు ఆయన తెలిపారు. అయితే రామచంద్రరావు […]
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా భారతీయ జనతాపార్టీ అభ్యర్ధి రామచంద్రరావు విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఈయన గెలిచారు. రామచంద్రరావుకు 13,318 ఓట్లు లబించాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నట్టు టీఆఆర్ెస్ టీ.ఆర్.ఎస్. అభ్యర్థి దేవీ ప్రసాద్ ప్రకటించారు. తన ఓటమి ప్రభుత్వ ఓటమి కాదని ఆయన స్సష్టం చేశారు. సరైన రీతిలో తాము ప్రచారం చేయలేకపోవడం వల్లే తాము ఓటమి పాలైనట్టు ఆయన తెలిపారు. అయితే రామచంద్రరావు గెలుపు సాంకేతికంగా జరిగిందే తప్ప టీ.ఆర్.ఎస్.పై వ్యతిరేకత వల్ల కాదని అన్నారు. నా గెలుపు తెలంగాణ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న వ్యతిరేకతను తెలిపిందని, ఇది టీ.ఆర్.ఎస్. ప్రభుత్వానికి షాక్ అని అన్నారు. తనను గెలిపించిన పట్టభద్రులకు రుణపడి ఉంటానని రామచంద్రరావు అన్నారు. ఈ విజయం బీజేపీ, టీడీపీ, పట్టభద్రుల గెలుపుగా రామచంద్రరావు అభివర్ణించారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రులస్థానానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి విజయ బాటలో పయనిస్తున్నారు. – పి.ఆర్.