తెలంగాణ సచివాలయానికి రూ.150 కోట్లు విడుదల
తెలంగాణ సర్కారు కొత్త సచివాలయం నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. ఎర్రగడ్డలోని చెస్ట్ ఆస్ప్పత్రి ప్రాంగణంలో దీని రూపకల్పనకు ఐదుగురు ఐ.ఏ.ఎస్. అధికారులతో ఓ కమిటీ వేసింది. ఇందుకోసం రూ. 150 కోట్లు విడుదల చేసింది. సచివాలయంతోపాటు ఇక్కడ మంత్రుల నివాసాలు, ఐ.ఎ.ఎస్. అధికారుల నివాస ప్రాంగణాలను కూడా ఇక్కడ నిర్మిస్తారు. సచివాలయంలో ఎవరైనా ఒక పని కోసం ఉదయం వస్తే సాయంత్రానికి సదరు పని పూర్తి చేసుకుని వెళ్ళేలా కొత్తగా నిర్మించే ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ […]
BY Pragnadhar Reddy24 March 2015 6:42 PM IST
X
Pragnadhar Reddy Updated On: 24 March 2015 6:42 PM IST
తెలంగాణ సర్కారు కొత్త సచివాలయం నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. ఎర్రగడ్డలోని చెస్ట్ ఆస్ప్పత్రి ప్రాంగణంలో దీని రూపకల్పనకు ఐదుగురు ఐ.ఏ.ఎస్. అధికారులతో ఓ కమిటీ వేసింది. ఇందుకోసం రూ. 150 కోట్లు విడుదల చేసింది. సచివాలయంతోపాటు ఇక్కడ మంత్రుల నివాసాలు, ఐ.ఎ.ఎస్. అధికారుల నివాస ప్రాంగణాలను కూడా ఇక్కడ నిర్మిస్తారు. సచివాలయంలో ఎవరైనా ఒక పని కోసం ఉదయం వస్తే సాయంత్రానికి సదరు పని పూర్తి చేసుకుని వెళ్ళేలా కొత్తగా నిర్మించే ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెలిపారు. సాధ్యమైనంత తొందరగా ఈ సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కావలసిన ఏర్పాట్లు చేయాలని ఆయన ఐ.ఏ.ఎస్. సభ్యుల కమిటీని కోరారు.
Next Story