Telugu Global
NEWS

విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్ సీపీ పోరుబాట

విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్ సీపీ పోరుబాట ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటకు సిద్ధమైంది. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబునాయుడు ఒక్కొక్కటిగా తన ముసుగును తొలగిస్తున్నారని ఆరోపించింది. చార్జీల పెంపుతో వినియోగదారులపై రూ.941 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం పడటాన్ని ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దాంతో చంద్రబాబు నాయుడు సర్కార్ ను నిలదీసేందుకు వైఎస్ఆర్ సీపీ సమాయత్తమవుతోంది. విద్యుత్ ఛార్జీల పెంపుపై వాయిదా తీర్మానం […]

విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్ సీపీ పోరుబాట ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటకు సిద్ధమైంది. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబునాయుడు ఒక్కొక్కటిగా తన ముసుగును తొలగిస్తున్నారని ఆరోపించింది. చార్జీల పెంపుతో వినియోగదారులపై రూ.941 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం పడటాన్ని ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దాంతో చంద్రబాబు నాయుడు సర్కార్ ను నిలదీసేందుకు వైఎస్ఆర్ సీపీ సమాయత్తమవుతోంది. విద్యుత్ ఛార్జీల పెంపుపై వాయిదా తీర్మానం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. అయితే దీన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. వైఎస్ఆర్ సీపీ సభ్యులు మాత్రం చర్చకు అనుమతించాలని పట్టుబట్టారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని స్పీకర్ తెలిపారు. దీనిపై మంత్రి యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకుని విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని, సభను సజావుగా నడిచేందుకు ప్రతిపక్షసభ్యులు సహకరించాలని అన్నారు.

First Published:  24 March 2015 7:37 AM IST
Next Story