జర నవ్వండి ప్లీజ్-7
తాగితేగానీ తన్నలేను.. ”రోజూ రాత్రి తాగి వెళతావెందుకు?” అనడిగాడు నాయుడు. ”మా ఆవిడ్ని తన్నటానికి” బదులిచ్చాడు రాయుడు. ”భార్యను తన్నటానికి ‘మందు’ తాగి వెళ్లాలా!” ఆశ్చర్యపోయాడు నాయుడు. ”తాగకుండా వెళితే ఆమే నన్ను తంతుంది” చల్లగా చెప్పాడు రాయుడు. ************ ‘చావు’కబురు చల్లగా… రోగి: డాక్టర్‌గారూ! నాకు బతకాలని లేదు. డాక్టర్: ఓస్..అంతేనా..నీ కోరిక నేను తీరుస్తా కదా! ************ తాగుడు చేసిన హత్య జడ్జి: నీ తాగుడు వ్యసనం మూలంగానే ఈ హత్య జరిగింది! తెలుసా? […]
తాగితేగానీ తన్నలేను..
”రోజూ రాత్రి తాగి వెళతావెందుకు?” అనడిగాడు నాయుడు.
”మా ఆవిడ్ని తన్నటానికి” బదులిచ్చాడు రాయుడు.
”భార్యను తన్నటానికి ‘మందు’ తాగి వెళ్లాలా!” ఆశ్చర్యపోయాడు నాయుడు. ”తాగకుండా వెళితే ఆమే నన్ను తంతుంది” చల్లగా చెప్పాడు రాయుడు.
************
‘చావు’కబురు చల్లగా…
రోగి: డాక్టర్‌గారూ! నాకు బతకాలని లేదు.
డాక్టర్: ఓస్..అంతేనా..నీ కోరిక నేను తీరుస్తా కదా!
************
తాగుడు చేసిన హత్య
జడ్జి: నీ తాగుడు వ్యసనం మూలంగానే ఈ హత్య జరిగింది! తెలుసా?
ముద్దాయి: హమ్మయ్య! హత్య నేను చేయలేదని మీరైనా అర్థం చేసుకున్నారు.
************
చదుపు చెప్పిన సన్నాసి
మాస్టారు: రమేశ్! నీ ప్రోగ్రెస్ కార్డులో సున్నాలొచ్చాయి కదా! మీ నాన్న ఏమన్నాడు? రమేశ్: ”నీకు చదువు చెప్పిన సన్నాసి ఎవడ్రా?” అన్నాడు సార్.