శ్రీసిటీలో ట్రక్కుల తయారీ కర్మాగారం ఏర్పాటుకి ఇసుజు సిద్దం
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటన ఫలించింది. రాష్ట్రానికి భారీ పరిశ్రమలు, వివిధ ప్రాజెక్టులపై పెట్టుబడులు తీసుకువచ్చేందుకు రెండు నెలల క్రితం ఆయన చేసిన జపాన్ పర్యటన ఫలితంగా ఇప్పుడు జపాన్‌కి చెందిన ఇసుజు ట్రక్కుల తయారీ సంస్థ చిత్తూరులో శ్రీ సిటీ వద్ద తమకు అన్ని సదుపాయాలూ కల్పిస్తే రూ. 1,500 కోట్ల భారీ పెట్టుబడితో ట్రక్కుల తయారీ కర్మాగారం ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నామని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తకాసి తెలియజేసారు. […]
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటన ఫలించింది. రాష్ట్రానికి భారీ పరిశ్రమలు, వివిధ ప్రాజెక్టులపై పెట్టుబడులు తీసుకువచ్చేందుకు రెండు నెలల క్రితం ఆయన చేసిన జపాన్ పర్యటన ఫలితంగా ఇప్పుడు జపాన్‌కి చెందిన ఇసుజు ట్రక్కుల తయారీ సంస్థ చిత్తూరులో శ్రీ సిటీ వద్ద తమకు అన్ని సదుపాయాలూ కల్పిస్తే రూ. 1,500 కోట్ల భారీ పెట్టుబడితో ట్రక్కుల తయారీ కర్మాగారం ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నామని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తకాసి తెలియజేసారు. తమ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా 2000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తే సరిగ్గా వచ్చే ఏడాది ఇదే సమయానికి తమ కర్మాగారంలో ఉత్పత్తి ప్రారంభించడానికి అవకాశాలున్నాయని తకాసి ఎపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు. అందుకు సీఎం కూడా సానుకూలంగా స్పందించారు. ఈ శ్రీసిటీ ప్రాంతంలోనే హీరో మోటార్ సైకిల్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ త్వరలో నిర్మాణ కార్యక్రామాలు ఆరంభించబోతోంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 543 ఎకరాలను కేటాయించింది. ఈరెండు పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రారంభిస్తే వీటికి అనుబంధంగా మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చంద్రబాబు భావిస్తున్నారు.