అసెంబ్లీ వద్ద వైకాపా నిరసన దీక్ష
అసెంబ్లీలో తమ పార్టీ పట్ల స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వైకాపా పార్టీ ఎమ్మెల్యేలు నిరసన ప్రదర్శన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి, ప్ల కార్డులు పట్టుకుని ప్రభుత్వ వైఖరిని దునుమాడుతూ పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. రెండు రోజుల క్రితం అసెంబ్లీ నుంచి ఎనిమిది మంది వైకాపా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం, ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహనరెడ్డికి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, బడ్జెట్‌పై తమ మనోగతాన్ని చెప్పుకునే […]
అసెంబ్లీలో తమ పార్టీ పట్ల స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వైకాపా పార్టీ ఎమ్మెల్యేలు నిరసన ప్రదర్శన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి, ప్ల కార్డులు పట్టుకుని ప్రభుత్వ వైఖరిని దునుమాడుతూ పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. రెండు రోజుల క్రితం అసెంబ్లీ నుంచి ఎనిమిది మంది వైకాపా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం, ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహనరెడ్డికి అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, బడ్జెట్‌పై తమ మనోగతాన్ని చెప్పుకునే వీలు లేకుండా అసెంబ్లీలో స్పీకర్ వ్యవహరించడాన్ని నిరసిస్తూ వైకాపా ఎమ్మెల్యేలంతా ఈ నిరసన ప్రదర్శన చేపట్టారు. తెలుగుతల్లి ఫ్లై ఒవర్ నుంచి అసెంబ్లీ వరకు కార్యకర్తలతో కలిసి వీరు పాదయాత్ర చేస్తూ తమ నిరసన గళాన్ని వినిపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వీరు తమ గళాన్ని వినిపించారు. ఒకవైపు చంద్రబాబు అసెంబ్లీలో రుణమాఫీపై ప్రకటన చేస్తున్నప్పుడు రైతు వ్యతిరేక విధానాలను తెలుగుదేశం ప్రభుత్వం అవలంబిస్తుందంటూ వైకాపా నిరసనకారులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ ఈ పాదయాత్రను కొనసాగించారు. వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీ బయట బైఠాయించి నిరసనను కొనసాగిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఇందులో భాగంగానే పట్టిసీమను చేపట్టారని వైకాపా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. ప్రజా పోరాటాల ద్వారా ఈ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని జగన్ నిర్ణయించారని ఆయన చెప్పారు. అసెంబ్లీలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టడానికి సోమ, మంగళవారాల్లో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతామని ఆయన తెలిపారు.