Telugu Global
National

తెలుగు రాష్ట్ర్రాలకు కరెంట్‌ ఊరట!

ఈ వేసవి కాలంలో తెలుగు రాష్ట్ర్రాలకు కొంత వరకు కరెంట్‌ కష్టాలు తీరే పరిస్థితి కనిపిస్తుంది. అసలే కరెంట్‌ కష్టాల్లో ఉన్న తెలంగాణకు ఇది చాలా మంచి శుభవార్త. ఏపీ ప్రభుత్వానికి చల్లని కబురు. తమకు ఎక్కువగా ఉన్న కరెంట్‌ను ఢిల్లీ ప్రభుత్వం తిరిగి ఇచ్చి వేయడంతో కేంద్రం ఇలా వెనక్కి వచ్చిన విద్యుత్‌ను దక్షిణాది రాష్ట్ర్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ రాష్ట్ర్రాలకు కేటాయించింది. ఢిల్లీ తిరిగి ఇచ్చిన కరెంట్‌లో తెలంగాణకు 222 మెగావాట్లు, ఆంధ్రప్రదేశ్‌కు 304 […]

తెలుగు రాష్ట్ర్రాలకు కరెంట్‌ ఊరట!
X

ఈ వేసవి కాలంలో తెలుగు రాష్ట్ర్రాలకు కొంత వరకు కరెంట్‌ కష్టాలు తీరే పరిస్థితి కనిపిస్తుంది. అసలే కరెంట్‌ కష్టాల్లో ఉన్న తెలంగాణకు ఇది చాలా మంచి శుభవార్త. ఏపీ ప్రభుత్వానికి చల్లని కబురు. తమకు ఎక్కువగా ఉన్న కరెంట్‌ను ఢిల్లీ ప్రభుత్వం తిరిగి ఇచ్చి వేయడంతో కేంద్రం ఇలా వెనక్కి వచ్చిన విద్యుత్‌ను దక్షిణాది రాష్ట్ర్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ రాష్ట్ర్రాలకు కేటాయించింది. ఢిల్లీ తిరిగి ఇచ్చిన కరెంట్‌లో తెలంగాణకు 222 మెగావాట్లు, ఆంధ్రప్రదేశ్‌కు 304 మెగావాట్లు, కేరళకు 167 మెగావాట్లు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 1 నుంచి దీన్ని వాడుకోవచ్చు. ఈ విద్యుత్‌ మొత్తాన్ని సెప్టెంబర్‌ 30 లోపు మాత్రమే వాడుకునే వెసులుబాటు ఉంటుంది. తెలంగాణలో కోతలకు సిద్ధపడాలని విద్యుత్‌ అధికారుల నిర్ణయం,… కరెంట్‌ కోతలకు ఎలాంటి పరిస్థితిలో పాల్పడవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశించిన నేపథ్యంలో ఇది నిజంగా చల్లని కబురే.

First Published:  23 March 2015 9:16 AM IST
Next Story