Telugu Global
International

నిజాం కేసులో పాక్‌కు ఎదురుదెబ్బ!

నిజాం కాలం నాటి డబ్బుకు సంబంధించి 67 యేళ్ళుగా సాగుతున్న ఓ కేసులో పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. బ్రిటన్‌ కోర్టు ఇచ్చిన ఓ కీలక తీర్పు వల్ల భారత్‌కు పాకిస్థాన్‌ నుంచి దాదాపు 315 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఏర్పడింది. భారత్‌కు న్యాయ రుసుముల కింద 1.50 లక్షల పౌండ్లు అంటే దాదాపు 1.35 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందిగా బ్రిటన్‌ న్యాయస్థానం పాకిస్థాన్‌కు ఆదేశాలు జారీ చేసింది. 1948లో హైదరాబాద్‌ రాజ్య ఏడో నిజాం నవాబుకు […]

నిజాం కేసులో పాక్‌కు ఎదురుదెబ్బ!
X

నిజాం కాలం నాటి డబ్బుకు సంబంధించి 67 యేళ్ళుగా సాగుతున్న ఓ కేసులో పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. బ్రిటన్‌ కోర్టు ఇచ్చిన ఓ కీలక తీర్పు వల్ల భారత్‌కు పాకిస్థాన్‌ నుంచి దాదాపు 315 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఏర్పడింది. భారత్‌కు న్యాయ రుసుముల కింద 1.50 లక్షల పౌండ్లు అంటే దాదాపు 1.35 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందిగా బ్రిటన్‌ న్యాయస్థానం పాకిస్థాన్‌కు ఆదేశాలు జారీ చేసింది. 1948లో హైదరాబాద్‌ రాజ్య ఏడో నిజాం నవాబుకు ప్రతినిధినని చెబుతూ ఓ వ్యక్తి అప్పట్లో 10.07 లక్షల పౌండ్లను బ్రిటన్‌లోని పాక్‌ హైకమిషనర్‌ హబీబ్‌ ఇబ్రహిం రహంతుల్లా పేరిట లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ బ్యాంకు ఖాతాకు తరలించారు. 1947లో భారత్‌, పాక్‌ సార్వభౌమ దేశాలుగా ఆవిర్భవించాక ఉపఖండంలోని రాజ్యాలు ఈ రెండింటిలో ఏదో ఒక దానిలో చేరడానికి లేదా స్వతంత్రంగా ఉండడానికి నిజాంను బ్రిటన్‌ అనుమతించింది. తాను స్వతంత్రంగానే ఉంటానని నిజాం నిర్ణయించుకున్నారు. 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ను భారత్‌లో విలీనం చేశారు. ఇదే నెల 20న 10.07 లక్షల పౌండ్లు లండన్‌కు బదిలీ అయ్యాయి. తన ఆమోదం లేకుండా ఈ డబ్బు బదిలీ అయ్యిందని తిరిగి ఆ డబ్బు తనకు ఇప్పించాలని వారం రోజుల తర్వాత నిజాం కోరారు. ఆ విధంగా చేయలేమంటూ బ్యాంకు నిరాకరించింది. ఈ కేసు ఇలా కొనసాగుతుండగా అసలు అది నిజాం సొంతం కాదని, హైదరాబాద్‌ భారత్‌లో విలీనం అయినందున ప్రభుత్వ ధనమైన ఆ డబ్బు భారత్‌కు ఇచ్చి తీరాలని కోరింది. కాని ఆ కేసు ఇప్పటి వరకు తేలలేదు. ఇపుడు బ్రిటన్‌ న్యాయస్థానం కీలక తీర్పు ఇస్తూ ఈ కేసులో పాక్‌కు సార్వభౌమ రక్షణ కవచం ఏదీ ఉండదని స్పష్టం చేసింది. దీంతో దాదాపు 315 కోట్ల రూపాయల మొత్తం పాక్‌ భారత్‌కు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

First Published:  23 March 2015 7:21 AM IST
Next Story