కొత్త దనం చూపించని "కపిరాజు'
నటవర్గం; నాని, శరత్ కుమార్,అమలాపాల్, రాగిణి, ద్వివేది, దర్శకత్వం : సముద్రఖని నిర్మాత : రజిత్ పార్థసారధి, శ్రీనివాసన్ సంగీతం: జి వి ప్రకాష్ జెండాపై కపిరాజు చిత్రం అవినీతి సమాజంపై దర్శకుడు ఎగరేసిన జెండాగా చెప్పవచ్చు.ప్రస్తుత సమాజంలో అవినీతి కూడా నీతిలా రూపాంతరం చెందింది. ప్రతి ఒక్కరి రక్తంలో స్వార్ధం నరనరాల్లో పాకి ఉంది. కష్టపడకుండా డబ్బు సంపాదించాలి. ఆదాయనికి మించి ఖర్చు చేయడం… అందినకాడికి వెనకేసుకోవడమే ఇప్పటి లక్ష్యం. పరిస్థితిల బట్టి బతకం ఇప్పటి సమాజపు దొరణి. మన […]
నటవర్గం; నాని, శరత్ కుమార్,అమలాపాల్, రాగిణి, ద్వివేది,
దర్శకత్వం : సముద్రఖని
నిర్మాత : రజిత్ పార్థసారధి, శ్రీనివాసన్
సంగీతం: జి వి ప్రకాష్
జెండాపై కపిరాజు చిత్రం అవినీతి సమాజంపై దర్శకుడు ఎగరేసిన జెండాగా చెప్పవచ్చు.ప్రస్తుత సమాజంలో అవినీతి కూడా నీతిలా రూపాంతరం చెందింది. ప్రతి ఒక్కరి రక్తంలో స్వార్ధం నరనరాల్లో పాకి ఉంది. కష్టపడకుండా డబ్బు సంపాదించాలి. ఆదాయనికి మించి ఖర్చు చేయడం… అందినకాడికి వెనకేసుకోవడమే ఇప్పటి లక్ష్యం. పరిస్థితిల బట్టి బతకం ఇప్పటి సమాజపు దొరణి. మన ప్రక్కన ఎది జరిగినా మనకెందుకు అని ప్రతి ఒక్కరు చూసి చూడనట్లు వెళ్లిపోతున్నారు. దానినే కధా వస్తువుగా దర్శకుడు సముద్రఖని తీసుకున్నాడు. దర్శకుడు ఈ అంశం ద్వారా కొత్తగా చేప్పిందేం లేదు. కమల్ హాసన్ నటించిన భారతీయుడు, చిరంజీవి నటించిన ఠాగూర్ చిత్రాలను కలిపి చూస్తే జెండాపై కపిరాజు. అయితే ఈ చిత్రంలో నాని నటన అధ్బుతంగా పండింది. చక్కని ఫెర్పొమెన్స్ ఇచ్చాడు. అయితే దర్శకుడు కథను నడిపించిన తీరు బాగోలేదు. మూడేళ్ళపాటు షూటింగ్ జరుపుకుని ఆఖరికి ఉగాది కానుకగా తెలుగు, తమిళ్ బాషల్లో విడుదలైన ఈచిత్రం ప్రేక్షకులను ఆకట్టుకో బోదనే చెప్పాలి. అసలు కథకు వస్తే ప్రపంచాన్ని మార్చాలి అంటే ముందు నువ్వు మారాలి. నీవ్వు మారితే ప్రపంచం దానంతట అదే మారుతుంది అనే కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని తీశాడు. కొడుకు అరవింద్ (నాని)ని చదివించలేక పోవడంతో తల్లి ఓ గురుకులంలో చేరుస్తుంది. గురుకులంలో మంచి అశయాలు ఆదర్శాలతో చదివి ఉద్యోగం సంపాదించుకుని బయట ప్రపంచంలోకి వస్తాడు అరవింద్. గురుకులంలో కనిపించిన క్రమశిక్షణ బయట కనబడకపోవటంతో అరవింద్ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాడు. క్రమశిక్షణ, నిజాయితీ ఏఒక్కరిలో కనిపించక పోవటంతో ఆలోచనలో పడతాడు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి స్నేహితుడి సపోర్ట్‌తో అవినీతిపై సమరానికి నాంది పలుకుతాడు. అన్యాయానికి, అక్రమాలకు, లంచాలతో బ్రతికే 147 మంది ప్రభుత్వ అవినీతి బండారాన్ని సాక్ష్యాధారాలతో రికార్డు చేసి మీడియా ముందుకు తెస్తాడు . వారిపై కోర్టులో కేసు వెస్తాడు. వారికి తగిన శిక్ష పడ్డాలి అని అరవింద్ అశిస్తాడు. ఈ 147 మంది ఒక సిండికెట్‌గా మారి తమ పలుకుబడితో బయట పడాలని చుస్తారు. అరవింద్ పోలికతో ఉండే తమిళనాడుకి చెందిన మయఖన్నన్ కొర్టులో ప్రవేశ పడతారు. అరవింద్‌కు అనుకులంగా సాక్ష్యం చేప్పి అవినీతి అధికారుల ఉద్యోగాలను కొర్టు తొలగించడంతో కథ సుఖాంతం అవుతుంది. రెండున్నర గంటల సినిమాను రెండు గంటలకు కుదిస్తే కొంత గందరగోళం తగ్గేది. కాన్సెప్ట్ మంచిదే అయినా ప్రేక్షకులకు చేప్పడంలో దర్శకుడు విఫలమయ్యాడు. సిఐడి అధికారిగా శరత్‌కుమార్ నటన సినిమాకి హెల్ప్ అయింది. అన్ని సినిమాలా ఇది కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. నాని శ్రమకు తగ్గ ప్రతి ఫలం దక్కలేదనే చేప్పాలి.