పార్లమెంట్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం
ఢిల్లీ: పార్లమెంట్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనం ప్రాంగణంలోని ఎయిర్ కండిషన్ ప్లాంట్ ఉన్న ప్రాంతంలో గత కొన్ని రోజులుగా మరమ్మత్తులు చేస్తున్నారు. ఎ.సి. ప్లాంట్‌కు వెల్డింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఈ ఘటనతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. పార్లమెంట్‌కు దారి తీసే అన్ని రహదారులను మూసి వేశారు. ఏడు అగ్నిమాపక శకటాలు ఈ మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నించి మొత్తానికి సఫలమయ్యాయి. అయితే ఈ ప్రమాదంపై రాష్ట్రపతి చాలా సీరియస్ […]

ఢిల్లీ: పార్లమెంట్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనం ప్రాంగణంలోని ఎయిర్ కండిషన్ ప్లాంట్ ఉన్న ప్రాంతంలో గత కొన్ని రోజులుగా మరమ్మత్తులు చేస్తున్నారు. ఎ.సి. ప్లాంట్‌కు వెల్డింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఈ ఘటనతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. పార్లమెంట్‌కు దారి తీసే అన్ని రహదారులను మూసి వేశారు. ఏడు అగ్నిమాపక శకటాలు ఈ మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నించి మొత్తానికి సఫలమయ్యాయి. అయితే ఈ ప్రమాదంపై రాష్ట్రపతి చాలా సీరియస్ అయ్యారు. ఎప్పుడూ అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో ఉండవలసిన పార్లమెంట్ భవనంలో ఇలాంటి ప్రమాదం జరగడం ఆయన ఆగ్రహానికి గురి చేసింది. దీనిపై వెంటనే ఆయన దర్యాప్తుకు ఆదేశించారు.