రాష్ట్రపతి ఉగాది శుభాకాంక్షలు
ఢిల్లీ: భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలుగు రాష్ట్ర్రాల ప్రజలకు ఉగాది శుబాకాంక్షలు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న తెలుగువారంతా ఈ పండుగను ఆనందంగాను, ఉత్సాహంగాను జరుపుకోవాలని, ప్రజలంతా ఈ మన్మద నామ సంవత్సరంలో ఆయురారోగ్యాలతోను, అష్టైశ్వర్యాలతోను తులతూగాలని ప్రణబ్ ఆకాంక్షించారు. ప్రజలంతా సహనంతోను, సామరస్యంతోను వ్యవహరించాలని, మానవతా విలువలను పెంపొందింపజేయాలని, దేశానికి పట్టుగొమ్మలైన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాలని ఆయన కోరారు. వసంతకాలంలో చెట్లు, మొక్కలు ఎలా పచ్చదనాన్ని పరుచుకుంటాయో… ఎటువంటి పరిమళాలు వెదజల్లుతాయో… అలాంటి […]

ఢిల్లీ: భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలుగు రాష్ట్ర్రాల ప్రజలకు ఉగాది శుబాకాంక్షలు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న తెలుగువారంతా ఈ పండుగను ఆనందంగాను, ఉత్సాహంగాను జరుపుకోవాలని, ప్రజలంతా ఈ మన్మద నామ సంవత్సరంలో ఆయురారోగ్యాలతోను, అష్టైశ్వర్యాలతోను తులతూగాలని ప్రణబ్ ఆకాంక్షించారు. ప్రజలంతా సహనంతోను, సామరస్యంతోను వ్యవహరించాలని, మానవతా విలువలను పెంపొందింపజేయాలని, దేశానికి పట్టుగొమ్మలైన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాలని ఆయన కోరారు. వసంతకాలంలో చెట్లు, మొక్కలు ఎలా పచ్చదనాన్ని పరుచుకుంటాయో… ఎటువంటి పరిమళాలు వెదజల్లుతాయో… అలాంటి భావజాలాన్ని ప్రజలు అలవరుచుకుని నడుచుకుంటే జాతి వాసికెక్కుతుందని రాష్ట్రపతి హితవు పలికారు.