Telugu Global
Business

బీమా రంగంలోకి మరిన్ని విదేశీ పెట్టుబడులు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో మూడు కీలక చట్టాలు ఆమోదం పొందిన నేపథ్యంలో బీమా రంగంలోకి భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులు రానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెబుతున్నారు. ‘కీలకమైన బీమా, గనులు, బొగ్గు కేటాయింపుల చట్టాలు పార్లమెంట్‌లో ఆమోదం పొందడం శుభపరిణామం.’ అని అన్నారు. కొత్తగా తెస్తున్న 2015 బీమా చట్టంలో 1938 నాటి బీమా చట్టం, 1972 నాటి జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ (నేషనలైజేషన్) చట్టం, 1999 నాటి ఐఆర్‌డిఎ […]

బీమా రంగంలోకి మరిన్ని విదేశీ పెట్టుబడులు
X

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో మూడు కీలక చట్టాలు ఆమోదం పొందిన నేపథ్యంలో బీమా రంగంలోకి భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులు రానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెబుతున్నారు. ‘కీలకమైన బీమా, గనులు, బొగ్గు కేటాయింపుల చట్టాలు పార్లమెంట్‌లో ఆమోదం పొందడం శుభపరిణామం.’ అని అన్నారు. కొత్తగా తెస్తున్న 2015 బీమా చట్టంలో 1938 నాటి బీమా చట్టం, 1972 నాటి జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ (నేషనలైజేషన్) చట్టం, 1999 నాటి ఐఆర్‌డిఎ చట్టాల్లో మార్పులు చేశారు. అంతేగాక బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 49 శాతానికి పెంచుతూ కూడా తాజా చట్టంలో సవరణలు చేశారు. కొత్త వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) కమిటీ చైర్మన్ పదవిన మరికొద్ది రోజుల్లో భర్తీ అవుతుందని జైట్లీ అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నుంచి కీలక అధికారాలను జేజిక్కించుకునే ఆలోచనేదీ తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా ఇదే విషయంపై ఇంతకుముందు మాట్లాడుతూ బీమా రంగంలోకి 25 వేల కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అన్నారు.

First Published:  21 March 2015 5:21 AM GMT
Next Story