Telugu Global
National

సుప్రీంకు మన్మోహన్‌

ఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో తన ఎదుట హాజరు కావాల్సిందిగా సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వును కొట్టి వేయాల్సిందిగా కోరుతూ మాజీ ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ వచ్చేవారం సుప్రీంకోర్టుకు వెళ్ళనున్నారు. విచారణ కోసం వచ్చేనెల 8న తన ముందు హాజరవ్వాలని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశించడాన్ని సవాలు చేస్తూ మన్మోహన్‌ తరఫున మాజీ కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్‌ సిబాల్‌, మరో క్రిమినల్‌ న్యాయవాది కె.టి.ఎస్‌. తులసి ఈ కేసు వేయనున్నారు. గత మార్చి 11న మాజీ […]

సుప్రీంకు మన్మోహన్‌
X

ఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో తన ఎదుట హాజరు కావాల్సిందిగా సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వును కొట్టి వేయాల్సిందిగా కోరుతూ మాజీ ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ వచ్చేవారం సుప్రీంకోర్టుకు వెళ్ళనున్నారు. విచారణ కోసం వచ్చేనెల 8న తన ముందు హాజరవ్వాలని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశించడాన్ని సవాలు చేస్తూ మన్మోహన్‌ తరఫున మాజీ కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్‌ సిబాల్‌, మరో క్రిమినల్‌ న్యాయవాది కె.టి.ఎస్‌. తులసి ఈ కేసు వేయనున్నారు. గత మార్చి 11న మాజీ ప్రధాని మన్మోహన్‌, పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పి.సి. ప్రకాష్‌లతోపాటు మరో ఐదుగురికి సమన్లు జారీ చేసింది. 2005లో ఒడిషాలోని తలబీర బొగ్గు గనుల కేటాయింపునకు సంబంధించి ఈ కేసు తెరమీదకు వచ్చింది.

First Published:  20 March 2015 10:39 AM GMT
Next Story