Telugu Global
NEWS

కేంద్రం నుంచి ఏపీ ప్రభుత్వం సాధించిందేంటి?

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ ప్రభుత్వంలో టీడీపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులున్నా ప్రయోజనం శూన్యమని వైకాపా నేత వై.ఎస్‌. జగన్‌ విమర్శించారు. ఈ ఇద్దరు మంత్రుల వల్ల రాష్ట్ర్రానికి ఒక్క దమ్మిడి అయినా మేలు జరిగిందా అని ప్రశ్నించారు. రాజ్యసభలో ప్రధానమంత్రి హోదాలో మోడీ చాలా హామీలిచ్చారని, ఒక్కటి కూడా నెరవేరలేదని ఆయన అన్నారు. రాష్ట్ర్రానికి ఇచ్చిన హామీలపై కేంద్రాన్ని నిలదీద్దామని ఆయన అంటూ “ఇద్దరం వెళదాం… మేము కూడా వస్తాం. కేంద్రం ఇచ్చిన […]

కేంద్రం నుంచి ఏపీ ప్రభుత్వం సాధించిందేంటి?
X

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ ప్రభుత్వంలో టీడీపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులున్నా ప్రయోజనం శూన్యమని వైకాపా నేత వై.ఎస్‌. జగన్‌ విమర్శించారు. ఈ ఇద్దరు మంత్రుల వల్ల రాష్ట్ర్రానికి ఒక్క దమ్మిడి అయినా మేలు జరిగిందా అని ప్రశ్నించారు. రాజ్యసభలో ప్రధానమంత్రి హోదాలో మోడీ చాలా హామీలిచ్చారని, ఒక్కటి కూడా నెరవేరలేదని ఆయన అన్నారు. రాష్ట్ర్రానికి ఇచ్చిన హామీలపై కేంద్రాన్ని నిలదీద్దామని ఆయన అంటూ “ఇద్దరం వెళదాం… మేము కూడా వస్తాం. కేంద్రం ఇచ్చిన హామీల అమలుకు ప్రయత్నిద్దాం’ అంటూ ఆఫర్‌ ఇచ్చారు. రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్ రేట్లు అధికంగా ఉన్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా రేట్లు ఉన్నా పట్టించుకున్న వారు లేరని, పెట్రోల్‌పై వేస్తున్న పన్నులు ప్రజలు భరించలేని విధంగా ఉన్నాయని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పన్నులున్నాయని జగన్‌ విమర్శించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా విద్యుత్‌ ఛార్జీలు పెంచారు. ఆనాటి ప్రభుత్వంపై మేం అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాం. అసెంబ్లీలో కిమ్మనకుండా తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది. అంటే తెలుగు కాంగ్రెస్‌లా టీడీపీ వ్యవహరించింది. ఇపుడు కిరణ్‌తో మాకు లింకు పెడతారు. ఇదేం చోద్యమో అర్ధం కావడం లేదు అంటూ జగన్‌ విమర్శించారు.

First Published:  20 March 2015 10:48 AM IST
Next Story