రైతులను మోసం చేసిన బాబుః జగన్
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను, మహిళలను, యువతను దారుణంగా మోసం చేస్తుందని వై.ఎస్.జగన్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఈ వర్గాలకు ఇచ్చిన హామీలన్నీ తుంగలోకి తొక్కిందని విమర్శించారు. రైతులు ఎంత మొత్తం బకాయి పడిందీ బ్యాంకులు వివరంగా చంద్రబాబుకు చెప్పాయని… కాని రుణ మాఫీ ఇంతవరకు పూర్తిగా జరగలేదని అన్నారు. దీనివల్ల రైతులు కొత్త రుణాలు తీసుకోలేక పోయారని, పంటల బీమా కోల్పోయారని, కొత్తగా భీమా చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని ఆరోపించారు. రైతులకు వడ్గీలు తడిసి […]
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను, మహిళలను, యువతను దారుణంగా మోసం చేస్తుందని వై.ఎస్.జగన్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఈ వర్గాలకు ఇచ్చిన హామీలన్నీ తుంగలోకి తొక్కిందని విమర్శించారు. రైతులు ఎంత మొత్తం బకాయి పడిందీ బ్యాంకులు వివరంగా చంద్రబాబుకు చెప్పాయని… కాని రుణ మాఫీ ఇంతవరకు పూర్తిగా జరగలేదని అన్నారు. దీనివల్ల రైతులు కొత్త రుణాలు తీసుకోలేక పోయారని, పంటల బీమా కోల్పోయారని, కొత్తగా భీమా చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని ఆరోపించారు. రైతులకు వడ్గీలు తడిసి మోపడయ్యాయి. ఒకప్పుడు వడ్డీలేకుండా, పావలా వడ్డీకి రుణాలు తీసుకున్న రైతులు ఇపుడు 14 శాతం పైగా వడ్డీకి రుణాలు తీసుకోవలసిన దుస్థితి కల్పించారని, ఇది రైతులను నిండా ముంచడం కాదా? అని ప్రశ్నించారు. రైతు రుణ మాఫీపై తొలి సంతకం చేస్తానని చంద్రబాబు చెప్పారు. ఇది గుర్తు చేద్దామని అసెంబ్లీలో ప్రయత్నిస్తే… ఇలాంటి విషయాలను ప్రస్తావించకూడదని స్పీకర్ నా నోరు నొక్కారు. రైతుల రుణ మాఫీ ప్రస్తావించగానే నేరుగా స్పీకరే పిక్చర్‌లోకి వచ్చేశారు. రైతుల టాపిక్ మాట్లాడకూడదని స్పీకర్ ఎలా చెబుతారు? మేం ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో స్పీకర్ మాకు చెబుతారా? ఇదెక్కడి న్యాయం. రైతుల రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో చంద్రబాబు చెప్పారు. డ్వాక్రా మహిళల నుంచి ముక్కు పిండి రుణాలు వసూలు చేశారు. నేను అది ప్రస్తావించాలనుకుంటే స్పీకర్ అడ్డు తగిలారు. ఇదేమని అడిగిన పాపానికి మా పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. బ్యాంకుల్లో ఉన్న బంగారం బయటకు రావాలంటే బాబే అధికారంలోకి రావాలని, జాబు రావాలంటే బాబే రావాలని ప్రకటనలు ఊదరగొట్టారు. చంద్రబాబు సంతకం చేసిన లేఖలను ప్రతి గుమ్మానికి కార్యకర్తలతో పంపించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. ఉద్యోగం, ఉపాధి కల్పించే వరకు ప్రతి నిరుద్యోగికి రూ. 2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. మరెందుకు వీటిని భర్తీ చేయరు? ఇప్పటి వరకు ఎపీపీఎస్సీకి క్యాలెండర్ లేదు. ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పరు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని హామీలు గుప్పించారు. ఆర్టీసీలో కండక్టర్ల పోస్టులకు భద్రత లేదు. డ్రైవర్లనే కండక్టర్లు చేస్తారట. ఏమిటీ దారుణం అంటూ జగన్ ప్రశ్నించారు. గత యేడాది ఒక్క ఇల్లు కూడా పేదలకు నిర్మించి ఇవ్వలేదు. ఈ యేడాది అసలు ఇళ్ళ నిర్మాణం గురించి ప్రస్తావనే లేదు. ఇదేం ప్రజా ప్రభుత్వం అంటూ నిలదీశారు.