Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Thursday, May 22
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS

    కేరళలో తొలిసారి జూ కాపలాదారులుగా స్త్రీలు

    By Telugu GlobalJune 22, 20232 Mins Read
    కేరళలో తొలిసారి జూ కాపలాదారులుగా స్త్రీలు
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    కేరళలో మొట్టమొదటిసారిగా ఐదుగురు మహిళలను జూ లో కాపాలాదారులుగా నియమించారు. త్రిష్యూర్ లోని పుతూర్ జూలాజికల్ పార్కులో అటవీ శాఖాధికారులు ఈ నియామకాలు చేశారు. ప్రస్తుతం ఈ జూని కొత్తగా అభివృద్ధి పరుస్తున్నారు. కేరళలో మొట్టమొదటి మహిళా జూ కీపర్లుగా వీరు చరిత్ర సృష్టించనున్నారని అక్కడి అటవీశాఖాధికారులు తెలిపారు. త్రిష్యూర్, తిరువనంతపురంలలో ఉన్న వందల ఏళ్లనాటి పాత జూలలో ఇప్పటివరకు మగవారే కీపర్లుగా పనిచేస్తున్నారు.

    రేష్మ, కష్టా కె చంద్రన్, శోబి, సాజీనా, నెషితా అనే అయిదుగురు మహిళలు… జూకీపర్లుగా పనిచేయటం మగవారికి మాత్రమే సాధ్యమనే అభిప్రాయం తప్పని నిరూపిస్తూ క్రూర మృగాల కాపలాదారులుగా విధుల్లో చేరారు. జూ కీపర్లుగా శిక్షణ పొందిన ఈ అయిదుగురు మహిళలు జూ లో జంతువులను ఒకబోనునుండి మరొక బోనుకి యంత్రపరికరాల సహాయంతో మార్చడం, బోనులను శుభ్రం చేయటం, జంతువులకు తిండి పెట్టటం, వాటిని పరిశీలిస్తూ వాటి ఆరోగ్య పరిస్థితులను గమనించడం లాంటి విధులను నిర్వహించాల్సి ఉంటుంది. పన్నెండేళ్ల వయసున్న వైగా అనే పులికి సంబంధించిన కార్యక్రమాలను ఈ మహిళలు తమ తోటి మగ ఉద్యోగులతో సమానంగా నిర్వర్తిస్తున్నారని అటవీ శాఖాధికారులు తెలిపారు. ఈ పులిని తిరువనంతపురం జూ నుండి త్రిష్యూర్ జూ కి తెప్పించారు. మరిన్ని జంతువులను ఇతర జూలనుండి ఇక్కడికి తెప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు.

    తామందరికీ జంతువులంటే ప్రేమ ఉందని అందుకే ఈ అవకాశం వచ్చినప్పుడు ఆనందంగా ఉద్యోగాల్లో చేరామని రేష్మ తెలిపింది. ప్రతిరోజు పులులకు సంబంధించిన పనులను చేస్తున్నా తాము వాటిని ముట్టుకోబోమని, అవి క్రూర మృగాలు కనుక వాటిని ముట్టుకోకూడదని ఆమె అన్నారు. వైగా గురించి చెబుతూ పేరు పెట్టి పిలిస్తే అది స్పందిస్తుందని, వైగాకి మ్యూజిక్ అంటే ఇష్టమనే విషయం తాము గమనించామని రేష్మ పేర్కొంది. వీరిలో చంద్రన్ గిరిజన జాతికి చెందిన మహిళ. ఆమెకు చిన్నతనంలో అడవిలో ఎలుగుబంట్లు, ఏనుగులకు దగ్గరగా మసలిన అనుభవం ఉంది. కేరళలో ఇంతవరకు మహిళా జూ కీపర్లు లేరని, మహిళలు ఈ విధులు నిర్వర్తించడం చాలా అరుదని పుతూరు జూ డైరక్టర్ ఆర్ కీర్తి అన్నారు.

    Kerala zookeepers
    Previous ArticleSamsung Galaxy S23 Ultra | మ‌రో 2 క‌ల‌ర్స్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్‌23 ఆల్ట్రా ప్రీమియం ఫోన్‌.. ధ‌రెంతంటే?
    Next Article ఇవి తింటే పొట్ట లైట్‌గా ఉంటుంది!
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.