TELUGU STATES

ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మోదీ ప్రసంగం కంటే.. యాదమ్మ వంటలే ఎక్కువ చర్చనీయాంశమయ్యాయి. రాజకీయ నాయకుల సభలు, సమావేశాలంటే.. స్టేజ్ పై మాట్లాడే వక్తలు ఎవరెవరు అనే విషయాకలంటే, మధ్యాహ్నం భోజనంలో ఉండే వెరైటీలు ఎన్ని, అవి ఏవి అనే విషయాలే ఆసక్తిగా మారుతున్నాయి. తాజాగా వైసీపీ రాష్ట్రస్థాయి ప్లీనరీలో కూడా ఫుడ్ మెనూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. పార్టీ కేంద్ర కార్యాలయమే ఈ ఫుడ్ మెనూపై ఓ ప్రకటన విడుదల చేయడం విశేషం. […]

రాముడు, హనుమంతుడు అనే కాన్సెప్ట్ సహజంగా బీజేపీ నేతలు ఓన్ చేసుకుంటారు. కానీ కాంగ్రెస్ లో కూడా రాముడు, హనుమంతుడు ఉన్నారని చెబుతున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ రాముడైతే.. తాను హనుమంతుడి లాంటివాడినని చెప్పారు. రామాయణంలో రాముడికి హనుమంతుడు అండగా ఉన్నట్టు.. తాను రాహుల్ గాంధీకి ఎప్పుడూ అండగా ఉంటానని అన్నారు. మీరంతా వానర సైన్యం అంటూ కాంగ్రెస్ శ్రేణుల్ని ఉద్దేశించి చెప్పారు. రావణాసురుడిని చంపడం కోసం ఎంత దూరమైనా వెళ్తామని అన్నారు […]

తెలుగు రాష్ట్రాల్లోని మీడియా ఛానెల్స్ అన్నీ.. రెండురోజులుగా చంద్రబాబు ఉంగరం గురించి కథనాలు వండి వార్చాయి. చంద్రబాబు కొత్త ఉంగరం పెట్టుకున్నారు, అది హైటెక్ ఉంగరం, దానిలో ఉన్న సుగుణాలు చూడండి అంటూ ఊదరగొట్టాయి. అసలు చంద్రబాబు ఏ ఉంగరం పెట్టుకుంటే జనాలకి ఉపయోగం ఏంటి..? ఆయన ఉంగరం పెట్టుకుంటే ఏంటి, పెట్టుకోకపోతే ఏంటి..? ఇక్కడ మీడియాని తప్పుబట్టలేం, బాబు ప్రమోషన్ మైండ్ గేమ్ ని మెచ్చుకోకుండా ఉండలేం. ఈమధ్య కాలంలో చంద్రబాబు వార్తలంటే ఆ మూడు […]

మహానాడు ఘనంగా జరిగింది, మినీ మహానాడులు అంతకంటే బాగా జరుగుతున్నాయని చెబుతున్నారు చంద్రబాబు. కానీ కొన్నిచోట్ల మాత్రం ఆయనకు తలనొప్పులు తప్పడంలేదు. అసలే నాయకులు లేరు, 2024లో ఎమ్మెల్యే అభ్యర్థుల్ని వెదుక్కోవాల్సిన పరిస్థితి ఉందని బాబు బాధపడుతుంటే.. ఉన్న నాయకుల్లో కూడా సఖ్యత లేకపోవడం మరో విశేషం. తాజాగా అన్నమయ్య జిల్లా కలికిరిలోని పుంగనూరులో జరిగిన టీడీపీ ఆత్మీయ సమావేశం రసాభాసగా మారింది. అధినేత చంద్రబాబు ముందే తెలుగు తమ్ముళ్లు కుమ్ములాట మొదలు పెట్టారు. మాది క్రమశిక్షణ […]

వైసీపీ ప్లీనరీకి సీఎం జగన్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ హాజరవుతుండటంతో.. భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు పోలీస్ అధికారులు. ప్లీనరీ పరిసర ప్రాంతాలతో పాటు అటు వైపు వెళ్లే రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పార్కింగ్ కోసం 25 ఎకరాల స్థలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్లీనరీ భద్రతా ఏర్పాట్లను సీపీ కాంతిరాణా టాటా పర్యవేక్షించారు. రెండు రోజులపాటు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్లీనరీ మొత్తం సీసీ‌ కెమెరాల పర్యవేక్షణలో […]

హైదరాబాద్ శివారులోని ఒక తోటలో కోడి పందాలు నిర్వహిస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రస్తుతం పరారీలో ఉన్న విషయం తెలిసిందే. బుధవారం రాత్రి మఫ్టీలో వెళ్లిన పటాన్‌చెరు పోలీసులు అక్కడ జరుగుతున్న తతంగాన్ని కూడా వీడియో తీశారు. పోలీసులు వచ్చిన విషయం తెలుసుకొని చింతమనేని సహా పలువురు వీఐపీలు పారిపోయారు. 49 మంది పందెంరాయుళ్లతో పాటు కార్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా, పరారీలో ఉన్న చింతమనేని ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు పెట్టారు. తాను […]

ఏపీలో విలీనం పేరుతో ప్రభుత్వ స్కూళ్లను మూసివేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో ఒక్క స్కూల్ కూడా మూసివేసే ప్రసక్తే లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో మొదటి సారి విద్యారంగంలో సంస్కరణలు జరుగుతున్నాయని, అవి కూడా విద్యా హక్కు చట్టం ప్రకారం జరుగుతున్నాయని వివరించారాయన. ఏపీలో బడులు మాయం అంటూ ఓ వర్గం మీడియా కట్టుకథలు అల్లుతోందన్నారు బొత్స. మాయమైపోడానికి బడులేమైనా ఎడ్ల బండ్లా, తోపుడు బండ్లా..? అంటూ ఆగ్రహం […]

ఇటీవల ముందస్తు ఎన్నికలపై ప్రతిపక్షాలు తెగ హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ నేతలు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయంటూ హడావుడి చేస్తున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన మినీమహానాడులోనూ టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు ఎన్నికలపై మాట్లాడారు. మరోవైపు కొన్ని మీడియాల్లోనూ ఈ మేరకు వార్తలు వస్తున్నాయి. కాగా వీటికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘ చంద్రబాబు నాయుడు ముందస్తు […]

జనసేన నాయకుడు నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీతో తెగతెంపులు చేసుకునేందుకు ఉన్న ఆఖరి అవకాశాన్ని నాగబాబు వాడుకున్నారా..? లేక మోదీ, జగన్ సాన్నిహిత్యం చూసి ఆయన ఈ కౌంటర్ వేశారా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఈ ట్వీట్ మంటపెట్టింది. వైసీపీ, బీజేపీ అభిమానులు కూడా నాగబాబుకి కౌంటర్లు ఇస్తున్నారు. ఇంతకీ నాగబాబు ఏమన్నారంటే..? అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభ గురించి నాగబాబు కాస్త […]

ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ భారత్ లో తమ విభాగాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం, అందులోనూ తెలంగాణను ఎంచుకోవడం ఆషామాషీ విషయం కాదు. కేవలం కంపెనీలను ఆహ్వానిస్తేనో, రాయితీలు ప్రకటిస్తేనో, మౌలిక వసతుల హామీ ఇస్తేనో ఇది సాధ్యం అవుతుందని అనుకోలేం. అంతకు మించి జరిగిన కృషి ఫలితమే తెలంగాణకు ‘సాఫ్రాన్’ కంపెనీ రావడం. తాజాగా శంషాబాద్‌లో ‘సాఫ్రాన్’ ఎయిర్‌ క్రాఫ్ట్ ఇంజిన్ సంస్థ మెగా ఏరో ఇంజిన్ (MRO) ఫెసిలిటీ సెంటర్ ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ […]