హైకోర్టు తీర్పు రిజర్వ్ అయి ఉండగా ఈ డ్రామా ఎందుకు?
ఫార్ములా ఈ-రేస్ కేసులో తన స్పందనను రాతపూర్వకంగా ఇచ్చిన తెలంగాణ భవన్‌కు వెళ్లిన కేటీఆర్
ఏసీబీ కార్యాలయం నుంచి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెనుదిగారు. తన తరఫు న్యాయవాదిని లోనికి అనుమతించకపోవడతో ఆయన వెళ్లిపోయారు. ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కేటీఆర్ విచారణకు వచ్చారు. బంజారాహిల్స్ ఏసీబీ ఆఫీసుకు లాయర్లతో కలిసి వచ్చిన కేటీఆర్ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. న్యాయవాదులెవరూ కేటీఆర్ వెంట వెళ్లకూడదని అడ్డుకున్నారు. పట్నం నరేందర్‌రెడ్డి విషయంలో ఎలా వ్యవహరించారో తనపై కూడా అలానే వ్యవహరించాలని చూస్తున్నారని అనుమానం కలుగుతున్నది. అందుకే చట్ట ప్రకారం ప్రతి పౌరుడికి ఉన్న తన హక్కును వినియోగించుకోనివ్వాలని కేటీఆర్ కోరారు. ఏసీబీ వాళ్లు గంటలుగా వాదనలు వినిపించారు. ఇవాళ కొత్తగా శోధించి.. సాధించేదేమీ లేదు. రైతు భరోసా ఎగ్గొట్టారు. దాని నుంచి దారి మళ్లించడానికి ఈ నాటకాలు. ఇలాంటి నాటకాలకు భయపడం, బాధపడం. నేను ఇక్కడికి రాగానే మా ఇంటిపై దాడులు చేస్తారనే సమాచారం ఉన్నది. రేవంత్‌రెడ్డి ఇచ్చిన 420 హామీలు అమలు చేసే వరకు కొట్లాడుతాం. కేసులు ఎన్ని పెట్టిన భయపడేది లేదు. నాతో పాటు లాయర్లు ఉంటే వాళ్లకు వచ్చిన నష్టమేంటి? అని కేటీఆర్ ప్రశ్నించారు.దీనిపై స్పందించారు. రోడ్డుపైనే తన స్పందనను రాతపూర్వకంగా ఏసీబీ అధికారులకు అందజేశారు.హైకోర్టు తీర్పు తర్వాత చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. రోడ్డుపైనే తన స్పందనను ఏసీబీ అధికారులకు అందించారు. న్యాయవాదిని అనుమతించకపోడంతో వెనుదిరిగారు. తన స్పందనను రాతపూర్వకంగా ఇచ్చిన తెలంగాణ భవన్‌కు వెళ్లారు.
తన ఇంటి మీదికి వెళ్లి తనిఖీలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రైడ్ పేరుతో వాళ్లు ఏమైనా చేస్తారేమోనని నాకు అనుమానం ఉన్నది. రేవంత్ రెడ్డి ఇచ్చిన పత్రాలు అక్కడ పెట్టి కేసులో ఇరికించాలనేది వారి తాపత్రయమని ఆరోపించారు. అందుకే చట్టపరంగా, న్యాయపరంగా వారిని ఎదుర్కొంటామన్నారు. హైకోర్టు తీర్పు రిజర్వ్ అయి ఉండగా ఈ డ్రామా చేయాల్సిన అవసరం ఏమున్నదో పోలీసులకే తెలుసని కేటీఆర్ అన్నారు.
హామీల అమలుకు నిలదీస్తున్నందుకే కేటీఆర్‌ను అరెస్టు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. విచారణకు సహకరిస్తున్నా అడ్డుకోవడంలో ఆంతర్యం ఏమిటో అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాలరాసే ప్రయత్నం జరుగుతున్నదని ఆక్షేపించారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్‌పై పెట్టిన ఈ కేసు చెత్త కేసు, ఫాల్తు కేసు అన్నారు. లంచం ఇస్తే ఇచ్చినవాడు ఒకడు, తీసుకున్నవాడు ఒకడు ఉంటాడు. కానీ ఇందులో ఏమీ లేదన్నారు. కానీ రేవంత్ రెడ్డి బృందం వెతికి వెతికి 200 పేజీల కేసు రాయడానికి ఏడాది పట్టింది. ఈ కేసులో ఏమీ లేదని, కొట్టివేయాలని హైకోర్టులో కేసు వేశాం. హైకోర్టులో తీర్పు రిజర్వులో ఉండగా.. ఏసీబీ నోటీసులు ఇచ్చింది. దీనికి కారణం ఏమంటే ఏడాది కాలంగా రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే రేవంత్‌రెడ్డి రైతు భరోసా విషయంలో రైతులను ఏవిధంగా మోసం చేశాడు. దీనిపై చర్చ వస్తుందని, ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడుతారని అందుకే దాన్ని డైవర్ట్ చేయడానికి హడావుడిగా నోటీసులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. హైకోర్టు లో ఈ కేసు తీర్పు రిజర్వులో ఉండగా.. నోటీసులు ఇచ్చారు కాబట్టి కేటీఆర్ విచారణకు వెళ్లారు. లాయర్లను చూస్తే రేవంత్‌రెడ్డికి ఎందుకు భయమవుతున్నదో తెలియడం లేదు. ఈ కేసులో కోర్టు పరిధిలో ఉండగా.. ఏసీబీ అధికారులు స్వామి భక్తిని ప్రదర్శించడానికి కొంత అత్యుత్సాహం చూపెడుతున్నారు. ఈ అంశంపై అసెంబ్లీ చర్చ చేద్దామంటే ఎందుకు పారిపోయారు అని ప్రశ్నించారు. ఇప్పటికీ ఫార్ములా ఈ-రేస్‌పై మీడియా సమక్షంలో చర్చపెడుదాం. అందులోమా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారు. మీరు సిద్ధమా రేవంత్ రెడ్డి అని సవాల్ విసిరారు.