బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తమ ప్రభుత్వం అప్రమత్తంగానే ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సెక్రటేరియట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బనకచర్ల విషయంలో మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలుపుతూ ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, జలశక్తి శాఖ మంత్రులకు లేఖలు రాశామన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందని వాటిని అడ్డుకోవాలని కోరామన్నారు.
Add A Comment