Telugu Global
Telangana

తెలంగాణకు కేసీఆర్ సీఎం అయితేనే రాష్ట్రం ద‌ర్జాగా ఉంటుంది : కేటీఆర్

తెలంగాణ ఈజ్ డెఫినెట్లీ రైజింగ్.. ఎందులో అంటే.. క్రైమ్ రేటులో అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు

తెలంగాణకు కేసీఆర్ సీఎం అయితేనే రాష్ట్రం ద‌ర్జాగా ఉంటుంది : కేటీఆర్
X

తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయితేనే.. దేశంలో తెలంగాణ ద‌ర్జాగా నిలుస్తుంద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మాజీమంత్రి కేటీఆర్ సమక్షంలో ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లాకు చెందిన ప‌లువురు నాయ‌కులు గులాబీ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రైజింగ్ అని అంటున్నారని, కానీ నేరాల్లో.. అప్పుల్లో ఆ రైజింగ్‌ కనిపిస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి నూతన ఇంచార్జి వస్తే సమావేశం పెట్టారు. ఆ మీటింగ్‌లో సీఎం రేవంత్‌ మూడు ఆణిముత్యాల్లాంటి మాటలు చెప్పారు. మంచి మైకులో చెప్పాలని.. చెడు చెవిలో చెప్పాలని ఆయన అన్నారు. మైక్‌లో చెప్పడానికి రేవంత్‌ రెడ్డి చేసిన మంచి ఏం లేదు. ఆయన చేసిన చెడు చెబితే చెవుల నుంచి రక్తం కారుతుంది. జనం కాంగ్రెస్‌ను.. రేవంత్‌ను తిట్టుకుంటున్నారు అని కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్ కొత్త ఇంచార్జి మీనాక్షి నటరాజన్ నా బ్యాగులు మోయవద్దని అంటున్నారు. కానీ, ఆమె నిజాలు తెలుసుకోవాలి. మీ పక్కన కూర్చున్న రేవంత్ రెడ్డి బ్యాగులు మోసి ఇక్కడికి వచ్చారు. ముఖ్యమంత్రికి టింగ్,టింగ్ అంటే నచ్చదు.

అందుకే రేవంత్ రెడ్డి టకీ,టకీ మని పైసలు పడతాయని అన్నారు. మరి ఇప్పటి వరకు ఎవరికైనా టకీ,టకీ మని పైసలు పడ్డాయా?. పదిశాతం ఖర్చు పెడితే శ్రీశైలం జలాలు చేవెళ్లకు వచ్చేవి కానీ రేవంత్ రెడ్డికి ఇష్టం లేక చేయడం లేదు. కమీషన్లు రావనే ఉదేశ్యంతోనే పాలమూరు, రంగారెడ్డి పూర్తి చేయడం లేదు. మూసీ వలన జరిగే లాభం ఎంత. కమీషన్ల కోసమే మూసీ అనే రంగుల సినిమా చూపుతున్నారు. మూసీతో 50-70 వేల కోట్లు కమీషన్లు తీసుకొని ఢిల్లీకి మూటలు పంపి సీఎం కుర్చీని కాపాడుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయి. త్వరలోనే కార్తీక్ ఎమ్మెల్యే అయ్యి శాసన సభలో అడుగుపెడతారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ కు తెలంగాణపై ఉండే ప్రేమ కాంగ్రెస్,బీజేపీకి ఒక్క శాతం అయినా వుంటుందా?. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచి ఏం చేసింది?. ఒక్క రూపాయి ఇవ్వని కమలం నేతలు ఓట్లు ఎట్లా అడుగుతారు?. దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతారా?. మనల్ని మనం ఓడించి.. మంది ముందు దరఖాస్తు పెట్టే పరిస్థితి వచ్చింది. పంచాయతీ ఎన్నికలు అయినా పార్లమెంట్ ఎన్నికలు అయినా ఎగరాల్సింది గులాబీ జెండానే అని కేటీఆర్ స్ఫష్టం చేశారు.

First Published:  1 March 2025 6:45 PM IST
Next Story