కొందరు సభ్యులు అసెంబ్లీకి తాగి వస్తున్నారు : హరీష్ రావు

అసెంబ్లీ బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టాలని మాజీ మంత్రి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, స్పీకర్ గడ్డం ప్రసాద్‌ని కోరారు. దీంతో శాసన సభలో గందరగోళం తలెత్తింది. పొద్దున్నే సేవించి కొందరు సభ్యులు వచ్చారని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అభ్యంతరం తెలిపారు. ఈ కామెంట్స్‌ని రికార్డుల నుంచి తొలిగించాలని కోరారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేస్తా…అంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు. ఆటో డ్రైవర్ల సమస్యల మీద అసెంబ్లీలో నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేస్తానని స్పీకర్ హెచ్చరించారు.
దీంతో తెలంగాణ అసెంబ్లీలో రసా భాస నెలకొంది. అయితే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కాస్త శాంతింప జేశారు. అనంతరం సభ సజావుగా జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నేడు రోడ్ల అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిమాట్లాడుతూ..‘హరీష్‌రావుకు దబాయించడం తప్ప పని చేయడం తెలియదు. నేను మాట్లాడుతుండగా ఎంత రిక్వెస్ట్ చేసినా కూర్చోవడం లేదని మంత్రి అన్నారు.