సీఎం రేవంత్ రెడ్డి ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్ లో ఆయన మాట్లాడారు. ఫార్మా సిటీ, ఫోర్త్ సిటీ, హైడ్రా, మూసీ పేరుతో పేదల ఇండ్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చేస్తుందన్నారు. తెలంగాణలో నిర్బంధం ఎక్కువయ్యిందని.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఏడో గ్యారంటీగా అమలు చేస్తామన్న స్వేచ్ఛ ఇప్పుడు అమలు కావడం లేదన్నారు. ఈ ప్రభుత్వంలో తాము భాగస్వాములుగా లేమన్నారు. తాము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మిత్రపక్షం కాదన్నారు. తామే మిత్రపక్షం అయి ఉంటే మంత్రి పదవులు తీసుకునే వాళ్లమని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై త్వరలోనే పోరాటాలు మొదలు పెడుతామని హెచ్చరించారు.
Previous Articleరేవంత్ లో ఆర్‌ఎస్‌ఎస్ మూలాలు.. అందుకే మైనార్టీలపై వివక్ష
Next Article హైదరాబాద్‌లో మూడు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
Keep Reading
Add A Comment