ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మాలేపూర్ ఘాట్‌లో యాత్రికులు ప్రయాణిస్తున్న వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 47 మంది యాత్రికులకు గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108, ప్రైవేటు వాహనాల్లో వాహనాల్లో రిమ్స్, నార్నూర్, ఉట్నూర్ ఆసుపత్రులకు తరలించారు. భక్తులు కెరమెరి మండలంలోని జంగుబాయి ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 60 మంది భక్తులు ఉన్నారు. వీరిని గుడిహత్నూర్ మండలం సూర్యగూడ గ్రామ ఆదివాసీలుగా గుర్తించారు.
Previous Articleనా కుమారుడికి ఉరి శిక్ష విధించండి..సంజయ్ రాయ్ తల్లి
Next Article మార్చిలో చర్లపల్లి నుంచి మరిన్ని రైళ్లు పరుగులు
Keep Reading
Add A Comment