నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ప్రతిమారాజ్‌ను ఆ బాధ్యతల ఉంచి తప్పించి.. చిన్న పిల్ల వైద్య విభాగం డాక్టర్ శ్రీనివాస్‌కు ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు అప్పగించారు. శుక్రవారం రాత్రి చికిత్స కోసం ఆస్పత్రికి వ్చిన రోగికి వైద్యం అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. స్థానిక ఎమ్మెల్యే పీఏ చెప్పడంతో రోగికి చికిత్స అందించారు. శనివారం ఉదయం ఆస్పత్రిలోని తన ఛాంబర్‌లో సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్ పుట్టినరోజు వేడకులను సిబ్బంది జరిపారు. విధుల్లో ఉండాల్సిన సిబ్బంది పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా.. ప్రతిమా రాజ్‌ను బాధ్యతల నుంచి తప్పించి, ఆస్పత్రిలో జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇన్‌ఛార్జి ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా శ్రీనివాస్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Previous Articleతెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు
Next Article జడ్-మోడ్ సొరంగాన్ని ప్రారంభించిన ప్రధాని
Keep Reading
Add A Comment