సంధ్య థియేటర్ తొక్కిసలాట సందర్బంగా రేవతి మహిళల మృతి కారణమయ్యాడని హీరో అల్లు అర్జున్ మీద కేసు పెట్టారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మరి ట్యాంక్ బండ్ వద్ద ఇద్దరి మరణానికి కారణమైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీద సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ ఎందుకు కేసు పెట్టలేదని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ ప్రశ్నించారు. అతని మీద కేసు పెట్టడానికి సీవీ ఆనంద్ ఎందుకు భయపడుతున్నాడని జడ్సన్ నిలదీశారు. 83 కేసులున్న క్రిమినల్ రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మా తెలంగాణ ప్రజలను మోసం చేశారని తెలంగాణాలో ప్రభుత్వాన్ని రద్దు చేయాలని రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేశాని ఆయన అన్నారు. యూత్ డిక్లరేషన్ అని యువతను మోసం చేసి, 49 మంది విద్యార్థుల చావుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి కారణం అయ్యారని బక్క జడ్సన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ఈనెల 26వ తేదీన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం రోజున సాయంత్రం ట్యాంక్ బండ్ సమీపంలోని పీపుల్స్ ప్లాజాలో భారతమాతకు హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగానే రాత్రి సమయంలో బాణాసంచా కాలుస్తుండగా..ట్యాంక్ బండ్లో పటాసులతో ఉన్న బోటులో అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గణపతి అనే వ్యక్తి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అగ్ని ప్రమాదంలో 80 శాతం ఆయనకు కాలిన గాయాలు అయ్యాయి మరో వ్యక్తి మృతి చెందాడు