గవర్నర్ ప్రతిభా పురస్కారాలకు పారా ఒలింపియన్ దీప్తి, ఫ్లోరైడ్ నిర్మూలన, ప్రకృతి ఉద్యమకారుడు దుశర్ల సత్యనారాయణ సహా పలువురు వ్యక్తులు ఎంపికయ్యారు. గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ -2024కు ఎంపిక వ్యక్తులు, సంస్థల వివరాలను తెలంగాణ రాజ్‌భవన్ సోమవారం ప్రకటించింది. ఈనెల 26న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు, సాంస్కృతిక విభాగాల్లో గడిచిన ఐదేళ్లుగా ఉత్తమ సేవలు అందిస్తున్న వారికి గవర్నర్ ప్రతిభ పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఆయా కేటగిరిల్లో అవార్డు కింద రూ.2 లక్షల నగదు, జ్ఞాపిక ఇచ్చి సత్కరిస్తారు. అవార్డుకు ఎంపికైన వారిలో పారా ఒలింపిక్స్ లో పతకం సాధించి తెలంగాణ క్రీడాకారిణి జీవాంజి దీప్తి, ఫ్లోరైడ్ నిర్మూలన, ప్రకృతి ఉద్యమకారుడు దుశర్ల సత్యనారాయణ, అరికపూడి రఘు, ప్రొఫెసర్ ఎం. పాండురంగారావు, పీబీ కృష్ణభారతి, ధ్రువాంశు ఆర్గనైజేషన్, ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి, ఆదిత్య మెహతా ఫౌండేషన్, సంస్కృతి ఫౌండేషన్ ఉన్నాయి.
Previous Articleఆర్జీకర్ దోషికి జీవిత ఖైదుపై.. సీఎం మమతా బెనర్జీ అసంతృప్తి
Next Article లోకేశ్ డిప్యూటీపై ఎవరూ మాట్లాడొద్దు
Keep Reading
Add A Comment