Telugu Global
Telangana

27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ : కిషన్‌రెడ్డి

27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ విజయం సాధించిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు.

27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ : కిషన్‌రెడ్డి
X

27 సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడబోతుందనికేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోనూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో బీజేపీకి అద్భుతమైన విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దేశ రాజధానిలో సాధించిన ఈ విజయం దక్షిణ భారతదేశంలోనూ బీజేపీకి మంచి ఊపునిచ్చే పరిణామం అని ఆయన అభివర్ణించారు.

తెలంగాణలో బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ పాలన సాగుతోందని ఆయన విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాలను రేవంత్ సర్కార్ మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని, వారిని అవమానిస్తోందని విమర్శించారు. బీసీల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని ఆయన అన్నారు.

First Published:  8 Feb 2025 3:30 PM IST
Next Story