దావోస్ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు చేరుకున్నరు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ముఖ్యమంత్రికి కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు .తెలంగాణకు రూ. 1,78,950 కోట్ల రికార్డుస్థాయి పెట్టుబడులు తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. దావోస్‌లో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో భారీ పెట్టుబడులు రానున్నాయని సమాచారం. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో ఇప్పటికే రూ 1.32 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది. తెలంగాణ ప్రభుత్వం. గత ఏడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి రూ 40,232 కోట్ల పెట్టుబడులు సాధించింది.
Previous Articleదిల్ రాజు నివాసంలో మళ్లీ ఐటీ సోదాలు
Next Article కూకట్‌పల్లి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాధవరం హౌస్ అరెస్టు
Keep Reading
Add A Comment