వనపర్తి వెంకన్న ఆలయంలో సీఎం పూజలు
స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వనపర్తి జిల్లాలో పర్యటించారు. దీనిలో భాగంగా స్థానిక శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రికి వేదపండితులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత ఆలయంలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు.అనంతరం వనపర్తి జీజీహెచ్ భవన నిర్మాణం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణం జెప్స్ (బాలుర) పాఠశాల, జూనియర్ కాలేజీ భవనాలు, వనపర్తి ఐటీ టవర్, శ్రీరంగాపురం దేవాలయం పనులు, పెబ్బేరు 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రి భవనం, రాజానగరం-పెద్దమందడి బీటీ రోడ్డు నిర్మాణ పనులు, సీసీఆర్ రోడ్ల నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.