ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన కొనసాగుతున్నది. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా మూడోరోజు వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం కానున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులపై ఆయనతో సీఎం చర్చించనున్నారు. యునీలివర్, డీపీ వరల్డ్ గ్రూప్, పెట్రోలియం నేషనల్ బెర్హాద్ (పెట్రోనాస్), గూగుల్ క్లౌడ్, పెప్సీకో, ఆస్ట్రాజెనెకా సంస్థల సీఈవోలతోనూ సీఎం సమాఏశం కానున్నారు. దావోస్ సమావేశాల్లో గ్రీన్‌కోతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకోనున్నది. ప్రకృతి వ్యవసాయం, హ్యూమన్ మిషన్ కొలాబ్రేషన్, గ్రీన్ హైడ్రోజన్-పునరుత్పాదక విద్యుత్ వంటి అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలకు సీఎం హాజరుకానున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు.
Previous Articleతెలంగాణలో భారీ పెట్టుబడికి ముందుకొచ్చిన ‘కంట్రోల్ ఎస్’
Next Article అలకనంద’ కిడ్నీ రాకెట్ వ్యవహారంపై ప్రత్యేక కమిటీ
Keep Reading
Add A Comment