వరంగల్ ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
వరంగల్లో మామునూరు ఎయిర్ పోర్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
BY Vamshi Kotas28 Feb 2025 4:28 PM IST

X
Vamshi Kotas Updated On: 28 Feb 2025 4:38 PM IST
వరంగల్లో మామునూరు ఎయిర్ పోర్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఎయిర్ పోర్టు భూసేకరణకు తెలంగాణ ప్రభుత్వం రూ.205 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. ఎయిర్ పోర్టు కోసం రూ. 696 ఎకరాల భూసేకరణ పూర్తి కాగా.. మరో 253 ఎకరాలు సేకరించాల్సి ఉందని వెల్లడించారు. ఈ విమానాశ్రయం నిర్మాణం త్వరగా పూర్తయితే తెలంగాణలో మరొక ఎయిర్‌పోర్ట్ ఏర్పడి, ప్రజలకు మరింత ప్రయాణ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. తెలుగు ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర విమానయాన శాఖా మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఎయిర్ పోర్టుల పనులు ముందుకు సాగుతున్నాయి.ఈ మేరకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు అనుమతి లేఖను జారీ చేసింది. అలాగే, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇచ్చిన ఎన్‌వోసీకి కేంద్రం ఆమోదం తెలిపింది.
Next Story